తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో అప్రమత్తంగా వుండాలి : ముఖ్యమంత్రి

-నిరంతర సహాయక చర్యలో జిల్లా యంత్రాంగం పనిచేస్తునది: జిల్లా కలెక్టర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
తుఫాన్ ప్రబావిత జిల్లాల్లో అప్రమత్తంగా వుండాలని, బాధితులకు మానవతా దృక్పదంతో అన్నిరకాలుగా ఆదుకోవాలని, నా పర్యటనలో ఎ ఒక్కరు సహాయం అందలేదు అని తెలపరాదని రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి జిల్లా కలెక్టర్లను , ఎస్.పి.లను ఆదేశించారు. సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి తుఫాన్ ప్రభావిత ఎనిమిది జిల్లాల తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కృష్ణ, ప.గోదావరి,కోనసీమ,కాకినాడ జిల్లాల కలెక్టర్లతో , ఎస్.పి.లతో వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించి పలు ఆదేశాలు జారీచేసారు. జిల్లా కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి, ఎస్.పి., పి పరమేశ్వర రెడ్డి, జేసి డికే బాలాజీ హాజరయ్యారు.

జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్ది వివరిస్తూ జిల్లా యంత్రాంగం పూర్తిగా తుఫాన్ కార్యక్రమాల్లో నిమగ్నమైందని , సాదారణ వర్షపాతం కన్నా కొన్ని మండలాల్లో అధికంగా ఈ 3 రోజుల్లో నమోదు అయిందని, ఇప్పటివరకు 31 గ్రామాల్లో సహాయక కేంద్రాలు ఏర్పాటు చేసి 2620 మందికి వసతి , భోజనం, త్రాగునీరు వంటి సౌకర్యాలు కల్పించామని, అలాగే 162 మంది ప్రసవసమయానికి 10 నుండి 15 రోజులు ఉన్న గర్భిణీ స్త్రీలను ఆసుపత్రులలో చేర్పించామని తెలిపారు. రాత్రి నుండి గాలుల ప్రభావం అధికంగా వుందని చాలా చోట్ల చెట్లు పడిపోతున్నాయని, ఎప్పటికప్పుడు తొలగించే ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. గతమాసం 30 నుండి వర్షాలు పడుతున్నాయని , దురదృష్ట వశాత్తు గుడిసె మట్టి గోడ కూలి 4 సంవత్సరాల బాలుడు మృతి చెందాడని , నేడు రూ. 4 లక్షలు కుటుంబానికి పరిహారం అందించనున్నామని తెలిపారు. జిల్లాలో పలు చోట్ల వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయని , ప్రాజెక్టుల్లో కళ్యాణి డాం మినహా అన్ని జలాశయాలు , జిల్లాలోవున్న 2557 చెరువులకు గానూ 1500 వరకు పూర్తిగా నిండాయని, మరో 600 చెరువుల్లో 50 నుండి 70 శాతం వరకు నిండాయని ఇబ్బందులు తలెత్తకుండా పోలిస్, రెవెన్యు, ఇరిగేషన్ అధికారులు నిరంతర పర్యవేక్షణ చేస్తున్నారని వివరించారు. వ్యవసాయ శాఖ కు సంభందించి వరి కోతలు పూర్తియ్యయని పెద్ద డామేజ్ లేదని, హార్టికల్చర్ కు సంబంధించి 25 ఎకరాల్లో ఇప్పటివరకు డామేజ్ అయిందని వివరించారు. గాలులు అధికంగా వుండట౦తో విద్యత్ స్థంబాలు 33 కెవి 13 పోల్స్ , 11 కెవి పోల్స్ 16 , సబ్ స్టేషన్ లు 29 వరకు డామేజ్ అయ్యాయని అవకాశం వున్నచోట పునరుద్దరణ యుద్ద ప్రాతిపదికన చేపదుతున్నామని , తుఫాన్ ప్రభావం పూతియినా 48 గంటల్లో పూర్తిస్థాయి నివేదిక అందిస్తామని వివరించారు. నేడు గౌ. ముఖ్యమంత్రి సూచించిన విధంగా పున్బరవాస కేంద్రాలనుండి ఇళ్ళకు వెళ్ళే సమయంలో ఒక్కరికి రూ. 1000/-, కుటుంబానికి 2500/- అందించనున్నామని, ఇంటికి వెళ్ళగానే ఇబ్బందులు లేకుండా నిత్యావసర వస్తువులు కొనుగోలు వంటివాటికి ఉపయోగపడతాయని వివరించారు.

జిల్లా కలెక్టరేట్ నుండి అడిషనల్ ఎస్.పి. కులశేఖర్ , డి ఆర్ ఓ పెంచల కిషోర్ , డిప్యూటి కలెక్టర్ లీగల్ సెల్ శ్రీనివాసరావు, సిపిఓ ప్రేమచంద్రా రెడ్డి, జిల్లా అధికారులు పాల్గొనారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *