Breaking News

ఔట్ ఫాల్ డ్రైన్లలో చెత్తను జెసిబి లతో తొలగిస్తున్న పనితీరు పరిశీలన

-లోగట్టు ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలను వెంటనే గుర్తించండి
-నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, సోమవారం ఉదయం నగరంలోని మిల్క ప్రాజెక్ట్, గుణదల, గుంట తిప్ప దగ్గర ఉన్న అవుట్ఫాల్ట్ డ్రైన్స్ ను పరిశీలించారు. మిచౌంగ్ తుఫాను కారణంగా నగరం లో విస్తారంగా వర్షాలు ఉంటాయి కాబట్టి, డ్రైన్లు నిండి పోయే పరిస్థితులు తలెత్తకుండా, ఎక్కువ మొత్తంలో పేరుకుపోయిన చెత్త ను జెసిబి లతో ఆ చెత్తను తొలగిస్తున్న పనితీరును పరిశీలించారు. తుఫాన్ తీవ్రత పెరుగుతున్న సందర్భంలో డ్రైన్స్ నుంచి ఎటువంటి ముంపు ప్రజలకు కలగకుండా ఉండాలని ఉద్దేశంతో ఆట్ ఫర్ డ్రైన్స్ లో నుంచి పేరుకుపోయిన చెత్త, ప్లాస్టిక్, గుర్రపుడేక్క ఎప్పటికప్పుడు పరిశుభ్రపరిచి ఆ ప్రాంతాల్లో గల ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని, లోగోట్టు ప్రాంతాల్లో గల నివాసులకు ముందస్తుగా సమాచారం అందించి వాళ్లకు ఆ ప్రాంతంలో గల స్కూల్లో కల్పించిన పునరావసం సౌకర్యాన్ని వినియోగించుకోవాలని, వారు ఏ ప్రాంతానికి చెందిన వారేనా వాళ్ళ వాలంటీర్ లేదా వీఆర్వో ద్వారా పాఠశాలలో కలిపించిన పునరావాసం గురించి తెలుసుకోవచ్చానన్నారు. నగరం లో ఉన్న లోగట్టు ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలను వెంటనే గుర్తించి వాళ్లను పునరావసం కేంద్రాలలో వసతి కల్పించాలని అన్నారు. ఈ పర్యటనలో కమీషనర్ తో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నారాయణమూర్తి జోనల్ కమిషనర్ రవి చంద్ ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గుంటూరు నగరంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మహిళా ఓటర్ల గుర్తింపు ప్రక్రియ ప్రారంభం : నగర కమిషనర్ మయూర్ అశోక్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల (G.O.Rt.No. 1165, MA&UD Department) ప్రకారం గుంటూరు నగర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *