Breaking News

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

-చిన్నారులను ఇంటి వద్దనే ఉంచండి
-మిచౌoగ్ తుఫాన్ ముందస్తు జాగ్రత్త చర్యలకు అధికారులకు ఆదేశాలు
-కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ సోమవారం ఉదయం విజయవాడ నగరపాలక సంస్థ ప్రధమ కార్యాలయంలోని కమాoడ్ కంట్రోల్ రూమ్ లో మిచౌoగ్ తుఫానుకు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్త చర్యలకు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలోని ప్రజలందరికీ మిచౌoగ్ తుఫాన్ గురించి అప్రమత్తం చేయాలని, చిన్నారులను ఇంటి వద్దనే ఉంచాలని, తూఫాను సూచనలు ఉన్నందున తీవ్ర గాలులు వర్షాలు పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఔట్ఫాల్ డ్రైన్ల వద్ద పిల్లల్ని పంపించకూడదని ఇంటి వద్దనే ఉంచి తగు జాగ్రత్తలు తీసుకోవాలని, తుఫాను సందర్భంగా ప్రజలకు ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఉండాలనే ఉద్దేశంతో కమిషనర్ గారు ప్రజలను త్రాగే నీటిని తాగే నీరు కాచి, చల్లార్చి,వడపోసిన నీటినే తాగమని ప్రజలందరినీ కోరారు.

డి వాటరింగ్ కోసం పంప్స్, ఔట్ ఫాల్ డ్రైన్స్ క్లీనింగ్ కోసం జెసిబిలు అన్నిచోట్ల ముందుగానే పెట్టేమని, కరెంటు సమస్య వచ్చిన ప్రజలకు త్రాగునీటికి ఎటువంటి సమస్య ఉండకూడదనే ఉద్దేశంతో అన్నిచోట్ల ఓవర్ హెడ్ ట్యాంక్లు ముందుగానే నింపి ఉంచామని, మరి ముఖ్యంగా తుఫాను నేపథ్యంలో తీవ్ర గాలుల వల్ల బానర్లు, హోర్డింగ్లు పడిపోయే అవకాశాలు ఉండొచ్చు కాబట్టి, విజయవాడ నగరపాలక సంస్థ పరిధి లో కొత్త బానర్లు, హోర్డింగ్లు పెట్టుటకు వీలు లేదని, ఉన్న బానర్లు, హోర్డింగ్లు ప్రమాదవశాత్తు ఏవి ఉన్నాయో గుర్తించి పలు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.

కొండ ప్రాంతాల్లో జాగ్రత్తగా ఉండాలని దయచేసి ముందుగానే ఆ స్థలాన్ని ఖాళీ చేసి, తుఫాను తీవ్రత తగ్గిన తర్వాత మరల వెళ్ళొచ్చని, అప్పటివరకు ఆ ఏరియాలో ఉన్న స్కూల్లో వాళ్లకు పునరావసం కల్పిస్తామని కమీషనర్ తెలిపారు. ఏ ప్రాంతంలో ఏ స్కూల్ కి వెళ్ళాలి అన్న విషయం, వాలంటీర్ లేదా వీఆర్వో ద్వారా తెలుసుకోవచ్చని అన్నారు.

గతంలో ఔట్ ఫాల్ డ్రైన్లో చిన్నపిల్లవాడు ప్రమాదసాత్తు పడి మరణించాడు, మళ్ళి అటువంతంటి ప్రమద్దలు జరగకుండా విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో గల ఔట్ఫాల్ట్ డ్రైనలు మొత్తం మూసివేసే అవకాశం లేనందున అందులో ఎక్కువగా చెత్త పేరుకుపోయినందున జెసిబి లతో వాటిని పరిశుభ్రపరచడం జరుగుతున్నదని, వాటిని మొత్తం ముయ్యటానికి సమయం పడుతుంది కాబట్టి ఎవరైతే అవుట్ఫాల్ట్ డ్రైన్ల దగ్గర నివసిస్తున్నారో తల్లిదండ్రులు తమ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలని, తుఫాను, వర్షాల వల్ల ప్రమాదాలు జరగకుండా చిన్నారులను ఇంటి నుండి బయటకు పంపకూడదని విన్నవించారు.

కాలువల నుండి పూడిక, రోడ్లపై నీరు నిలువ, నీటి పైపులు లీకులు, రిపేర్లు ,కాలువకు మరమ్మత్తులు, సీజనల్ వ్యాధులు, చెట్టు విరిగిపడిపోవుట, మొదలగు సమస్యల కోసం ఒక ప్రత్యేక సెల్లు ప్రధాన కార్యాలయం నందు ఏర్పాటు చేశారు. తుఫాను సందర్భంగా ప్రజలు వారి పరిసరాల నందు గల రోడ్లు కాలనీలో ఎదుర్కొనబోవు సమస్యలను ల్యాండ్ లైన్ నెంబర్ 0866-2422515, టోల్ ఫ్రీ నెంబర్ 18004252000, వాట్సాప్ నెంబర్ 8181960909 ద్వారా ప్రజలు తమ సమస్యలను తెలియజేయచ్చని, సదరు సమస్యలను సంబంధిత అధికారికి తెలియజేసిన పిమ్మటే సత్వరమే పరిష్కారాలు అందించాలన్నారు. ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉండేందుకు కంట్రోల్ రూమ్ నందు మూడు షిఫట్లలో పనిచేసేందుకు వివిధ శాఖల నుండి అధికారులకు డ్యూటీలు వేశారు. కావున తుఫాను సందర్భంగా ప్రజలకు ఎటువంటి సమస్య కలిగిన వెంటనే పైన తెలిపిన నెంబర్లకు ఫోను చేసి తమ సమస్యలను తెలుపవలసిందిగా కమిషనర్ కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పాఠశాల బస్సు డ్రైవర్లు నిబద్ధతతో విధులు నిర్వహించాలి

-విద్యార్థుల భద్రత డ్రైవర్లపై ఉన్న అత్యంత కీలక బాధ్యత -డ్రైవర్లు విధిగా యూనిఫామ్ ధరించాలి -డ్రైవింగ్ నైపుణ్యంతో పాటు మంచి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *