-మీడియా సమావేశంలో జంగా గౌతమ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించిన విజయస్ఫూర్తితో ఏపీలో కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేస్తామని ఏపీసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జంగా గౌతం సోమవారం జరిగిన మీడియా సమావేశంలో వివరించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని వారి ఆత్మగౌరవం కోరుకునేవారు రానున్న రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ను బలోపేతం చేసి గెలిపించాలని రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు రాష్ట్రంలో సామాజిక న్యాయం కాంగ్రెస్ తోనే సాధ్యమని ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాను కోరుకునే రాజకీయ నాయకులు అభివృద్ధిని కోరుకునే నాయకులు కాంగ్రెస్ ను బలోపేతం చేయాలని ఆయన కోరారు 2024లో జరగనున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పాత్ర పోషిస్తామని శ్రీ గౌతమ్ వెల్లడించారు కాంగ్రెస్కు రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాల వెనకబడిన తరగతుల వారు మైనారిటీ వర్గాలు పూర్తి సహాయ సహకారాలను అందించాలని ఆయన అభ్యర్థించారు ఈ నెల 13న విజయవాడలో ఏపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ఎన్నికల రోడ్ మ్యాప్ ను రూపొందించి ఎన్నికల్లో ముందంజ వేయడానికి సిద్ధమవుతున్నట్లు ఆయన పేర్కొన్నారు మీడియా సమావేశానికి ముందు ఉమ్మడి ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ కురువృద్ధులు కీర్తిశేషులు కె. రోశయ్య గారి వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు సోమవారం ఉదయం హఠాత్తుగా మృతి చెందిన గుంటూరుకు చెందిన ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీ జక్కా శ్రీనివాస్ కు ఘన నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు మీడియా సమావేశంలో గౌతమ్ తో పాటు విజయవాడ నగర కాంగ్రెస్ అధ్యక్షులు నరసింహరావు, ఏపీసీసీ ఆర్గనైజింగ్ కార్యదర్శి శ్రీ రామ్మూర్తి, ఉపాధ్యక్షులు వి. గురునాథం, కాంగ్రెస్ నాయకులు కొలనుకొండ శివాజీ, అన్సారి, ఖుర్షీద, అల్లం రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News