ఉద్యోగుల సమస్యల పై అందే ఫిర్యాదులను వేగంగా పరిష్కరించాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఉద్యోగుల సమస్యల పై అందే ఫిర్యాదులను వేగంగా పరిష్కరించాలని నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ బి శ్రీనివాసరావు సూపరిండెంట్లను ఆదేశించారు. కమిషనర్ కీర్తి చేకూరి ఆదేశాల మేరకు సోమవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్లో ఎంప్లాయీస్ గ్రీవెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ మాట్లాడుతూ నగరపాలక సంస్థకు చెందిన వివిధ విభాగాల ఉద్యోగులకు సంబందించిన సర్వీస్ సమస్యల పరిష్కారం కోసం ప్రతి నెల 3 వ సోమవారం మధ్యాహ్నం 3 నుండి 4 గంటల వరకు ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహిస్తున్నామన్నారు. గ్రీవెన్స్ లో నగరపాలక సంస్థ పరిధిలోని వార్డ్ సచివాలయ కార్యదర్శులు, మినిస్టీరియల్ సిబ్బంది, ఆయా విభాగ ఉద్యోగులు తమ విధి నిర్వహణలో ఎదురవుతున్న, సర్వీస్ కి సంబందించిన సమస్యల పై అర్జీలు అందించవచ్చని తెలిపారు. ఉద్యోగులు తమ సమస్యల పై అందించే అర్జీలను ప్రత్యేకంగా రిజిస్టర్ లో నమోదు చేయాలని, తదుపరి గ్రీవెన్స్ నాటికి ప్రస్తుతం అందిన అర్జీల పరిష్కార వివరాల రిపోర్ట్ తో హాజరు కావాలని మేనేజర్ ని ఆదేశించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని, ఉద్యోగులు కూడా ప్రజలకు మెరుగైన సేవలు అందేలా కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో మేనేజర్ శివన్నారాయణ, వివిధ విభాగాల సూపరిండెంట్లు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *