-లక్ష్యాలను నిర్థేశించుకొని ఆ దిశగా ఇష్టంతో కష్ట పడితే ఫలితాలు సాధ్యం
-కలెక్టరు డా. కే. మాధవీలత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ పోటీ ప్రపంచంలో మరింత రాణించే విధంగా ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్ధులకు, ఉపాధ్యాయులకు ఉచిత ట్యాబ్ లను అందజేసి నాణ్యమైన భోధనా విధాణఆన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో అందించడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత పేర్కొన్నారు.
గురువారం రాజమహేంద్రవరం రూరల్ మండలం ధవళేశ్వరం జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో నిర్వహించిన జిల్లా స్థాయి ఉచిత ట్యాబ్ ల పంపిణీ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ మాధవీలత ముఖ్య అతిధిగా హాజరయ్యారు.
ఈ సందర్బంగా కలెక్టర్ డా. కె. మాధవీలత మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్.జగన్మోహన్ రెడ్డి విద్యావ్యవస్థలో కీలక మార్పులు తీసుకొచ్చి డిజిటల్ బోధనా విధానాన్ని అందించడం జరిగిందన్నారు. పాఠశాలల అభివృద్ది అత్యంత ప్రాధాన్యతనిస్తూ నాడు – నేడు పనులు ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చారన్నారు. జగనన్న గోరుముద్ద పధకం ద్వారా పౌష్టికాహారాన్ని అందిస్తూ బాలబాలికలకు మద్యాహ్న భోజన పథకం తో పాటు రక్తీహీనతకు గురి కాకుండా చిక్కీలను అందిస్తూ వారిలో రోగనిరోధక శక్తిని పెంచుతున్నారన్నారు. అమ్మఒడి పథకం ద్వారా తల్లి తండ్రులు పిల్లలను పాఠశాలలకు పంపేందుకు తల్లుల ఖాతాల్లో 15 వేల రూపాలయలు జమ చేసి వారి ఆర్థికంగా చేయూత నివ్వడమే కాకుండా జగన్న కానుక క్రింద స్కూలు డ్రస్, పాఠ్య పుస్తకాలు, షూలు, నోట్ బుక్స్, స్కూల్ బ్యాగ్ వంటివి ఉచితంగా అందించి ఎటువంటి ఆటకం లేకుండా విద్యార్థులు చదుకునేందుకు ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు.
ఉన్నత స్థాయిలోనికి ఎదగాలంటే కష్టపడే తత్వం పట్టుదల, లక్ష్యాలు తప్పనిసరిగా ఉండాలన్నారు. ఏదీ కష్టపడకుండా సాధించలేమని ఈ రోజు నేను కలెక్టరుగా ఉన్నానంటే నిరంతరం పట్టుదల కృషితో మాత్రమే అది సాద్యమైందని కలెక్టరు మాధవీలత పేర్కొన్నారు. నేడు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న అత్యున్నత విద్యా భోదన అవకాశాలను పాఠశాలలో ఏర్పాటు చేసిన మౌలిక సదుపాయాలు ప్రయివేట్ పాఠశాలకంటే ఎంతో దీటుగా ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలకు అందుబాటులోకి రావడం నిజంగా మీ అదృష్టం అని కలెక్టరు విద్యార్థులకు సూచించారు.
తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని ప్రభుత్వం పాఠశాల విద్యార్థుల విద్యా ప్రయోజనం కోసం ఈ ఏడాది రు.48.67 కోట్లతో 15210 మంది విద్యార్థులకు ట్యాబ్‌ల అందిస్తున్నామన్నారు. గత ఏడాది రు.56.80 కోట్లతో విద్యార్థులకు ఉపాధ్యాయులకు కలపి 17736 ట్యాబ్‌లను అందిచామన్నారు. టాబ్స్ ద్వారా యానిమేటెడ్ వీడియోలు, క్విజ్‌లు మరియు మరిన్నింటి ద్వారా అభ్యాసాన్ని ఇంటరాక్టివ్, విద్య పట్ల సమగ్ర దృక్పథంతో, రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ట్యాబ్‌లను పంపిణీ చేసిందన్నారు. పిల్లలు తమ అకాడెమిక్ డెవలప్‌మెంట్ కోసం ట్యాబ్‌లను సమర్థవంతంగా ఉపయోగిస్తూ, భావనలను, దృశ్యమానంగా మరియు స్వీయ విశ్లేషణతో అర్థం చేసుకొనేందుకు ఇది ఒక చక్కని అవకాశంగా కలెక్టరు పేర్కొన్నారు. బైజస్ యాప్ ప్రయోగాత్మకంగా నేర్చుకోవడంపై కూడా దృష్టి సారిస్తూ విద్యార్థులను ప్రోత్సహిస్తున్నామన్నారు.
Prajavartha Online Telugu News