Breaking News

ట్రీ రీ ప్లాంటేషన్ కార్యక్రమం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
గురువారం రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్స్ వినూత్నముగా, రాజానగరం ఏడీబీ రోడ్డు వైన్డింగ్ లో 60 సంవత్సరాల వయసుగల కళాత్మకమైన రూపంలో ఉన్న మర్రి చెట్టును గత 60 రోజులుగా ట్రీట్మెంట్ చేస్తు నూతన ఏరులను వచ్చేదాకా ఉంచి నేడు ఆ వృక్షమును క్రేన్సు ర్యాలీలు ద్వారా తెచ్చి ట్రీ రీ ప్లాంటేషన్ కార్యక్రమం వై జంక్షన్ లో గల కలెక్టర్ క్యాంప్ ఆఫీస్ పక్కన నూతనంగా నిర్మించుచున్న కలెక్టర్ సమావేశం భవన ప్రాంగమునందు ఏర్పాటు చేశారు.

తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్  కె మాధవి లత వారి చేతుల మీదుగా పూజాది కార్యక్రమాలు నిర్వహించి భారీ క్రేన్ సహాయంతో నాటుట జరిగినది ,

కలెక్టర్ కె. మాధవీ లత మాట్లాడుతూ రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్స్ వారు చాలా మంచి గొప్ప కార్యక్రమం చేపట్టారని అభినందించారు. ఇది మానవ సమాజానికి నేడు ఎంతో అవసరమైనది, స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి ఇలాంటి సమాజ హిత కార్యక్రమాలు చెయ్యాలని, వాటికి మా తోడ్పాటు ఎప్పుడూ ఉంటుందని తెలుపుతూ, ఇంత మహాతర కార్యక్రమం చేయుట ద్వారా సమాజానికి ఒక మంచి సందేశం తెలియజేయు చున్నందుకు క్లబ్ అధ్యక్షులు Rtn. తీగెల రాజాను అభినందించినారు,

Rtn తీగెల రాజా మాట్లాడుతూ… జీవ ప్రాణికి ప్రాణవాయువును ఇచ్చే వృక్షములను ఏ కారణం వల్ల కూడా నరకకూడదని ఎన్నో టన్నుల ఆక్సిజన్ ఇచ్చు వృక్షాలను తిరిగి మరొకచోటన నాటటానికి స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వం వారు ముందుకు రావాలని కోరినారు, మా క్లబ్బు మరి ఒక 10 వృక్షాలను ఐడెంటిఫై చేయడం జరిగింది అందు రెండు వృక్షాలకు ట్రీట్మెంట్ స్టార్ట్ అయినది అని తెలిపినారు,

ఈ కార్యక్రమమునకు విశిష్టత అతిధి గా మున్సిపల్ కమిషనర్ కె దినేష్ కుమార్ , రోటరీ క్లబ్ రోటీరియన్ డాక్టర్ గన్ని భాస్కరరావు విచ్చేసినారు, ఈ ప్రోగ్రాం ను స్పాన్సర్ చేసిన సిహెచ్ సంపత్ కుమార్ (బ్రేక్ ఇన్స్పెక్టర్) దంపతులను కలెక్టర్ సన్మానించినారు.

అలాగే ప్రోగ్రాం చైర్మన్, డైరెక్టర్ Rtn ఆర్ .దుర్గాప్రసాద్ చాలా మంచి పని చేశారని అభినందించి సత్కరించినారు , కలెక్టర్ మాధవీలత ను , అతిధులను
రొటీరియన్ తీగెల రాజా దుశాలువాల లతోసత్కరించి మెమొంటోలు బహుకరించినారు,

ఈ కార్యక్రమంలో ఆర్ట్స్ కాలేజీ విద్యార్థులు మరియు రోటరీ క్లబ్ వైస్ ప్రెసిడెంట్ Rtn ఇమాని కిరణ్ క్లబ్ డైరెక్టర్లు,సభ్యులు పాల్గొని కార్యక్రమమును విజయవంతం చేశారు. Rtn అరుణ్ కుమార్ సెక్రెటరీ,  వందన సమర్పణ చేసినారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *