ప్రతిఒక్కరూ సేవాగుణాన్ని అలవర్చుకోవాలి

– రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
-మల్లాది వేంకట సుబ్బారావు – సుందరమ్మ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తోపుడు బండ్ల పంపిణీ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సమాజ సేవను ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకుని పనిచేయాలని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పిలుపునిచ్చారు. గడప గడపకు మన ప్రభుత్వం పర్యటన సమయంలో పలువురు పేదలు తమ కుటుంబ పోషణ నిమిత్తం దారి చూపవలసిందిగా ఎమ్మెల్యేకు విన్నవించారు. స్పందించిన ఆయన బుధవారం ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనములో 16 మంది వీధి వ్యాపారులకు వైసీపీ కార్పొరేటర్లతో కలిసి తోపుడు బండ్లను అందజేశారు. మన ఎదుగులలో కీలక పాత్ర పోషించిన సమాజానికి తిరిగి సేవ చేయవలసిన బాధ్యత అందరిపై ఉందని ఈ సందర్భంగా మల్లాది విష్ణు పేర్కొన్నారు. ప్రజల అవసరాలను, సమస్యలను గుర్తించి మానవతా దృక్పథంతో ఆదుకోవాలని.. అప్పుడే సమాజాభివృద్ధి సాధ్యపడుతుందని అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు చెప్పిన మాటలు తనకు మార్గదర్శకమని.. ఆయన స్ఫూర్తితో 2013లో మల్లాది వేంకట సుబ్బారావు సుందరమ్మ ఛారిటబుల్ ట్రస్ట్ ప్రారంభించినట్లు చెప్పారు. ట్రస్ట్ ద్వారా నిరుపేద కుటుంబాలకు జీవనోపాధి కల్పించేందుకు తన వంతు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే ట్రస్ట్ ద్వారా ఉచిత రక్తదాన శిబిరాలు, పేద విద్యార్థులకు స్కాలర్ షిప్ ల పంపిణీ, హెల్త్ క్యాంపులు, కుట్టు మిషన్లు, ప్లాట్ ఫామ్ రిక్షాలు, తోపుడు బండ్లు, ఇస్త్రీ పెట్టెలు, క్రీడాకారులకు స్పోర్ట్స్ కిట్ల పంపిణీ వంటి ఎన్నో కార్యక్రమాలను దిగ్విజయంగా నిర్వహించినట్లు వెల్లడించారు. కరోనా సమయంలోనూ పేదలకు ఉచితంగా ఆహారం, మందులను పంపిణీ చేసినట్లు తెలిపారు. రానున్న రోజుల్లో సేవలను మరింత విస్తృతం చేస్తామని తెలియజేశారు. సామాజిక బాధ్యతగా తాను చేస్తున్న సేవా కార్యక్రమాలకు ప్రజల ఆదరాభిమానాలు ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం గిరిపురంకు చెందిన 14 కుటుంబాలకు గతంలో ఆమోదింపబడిన రెగ్యులరైజ్డ్ పట్టాలను అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మార్వో(సెంట్రల్) శ్రీనివాస్ వెన్నెల, కార్పొరేటర్లు ఉద్దంటి సునీత సురేష్, కుక్కల అనిత రమేష్, శర్వాణి మూర్తి, ఉమ్మడి రమాదేవి వెంకట్రావు, నాయకులు యరగొర్ల శ్రీరాములు, మోదుగుల గణేష్, కనపర్తి కొండా, బత్తుల దుర్గారావు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *