ఆదివారం కూడా పని చేయనున్న అన్ని పన్ను చెల్లింపు కేంద్రాలు

-నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శుక్రవారం నాడు విడుదల చేసిన ఒక ప్రకటనలో విజయవాడ నగరపాలక సంస్థ వారికి చెల్లించవలసిన ఆస్తి పన్ను, ఖాళీ స్థలాల పన్ను మరియు ఇతర పన్నులను డిసెంబర్ 31, 2023 లోగా చెల్లించవలసిందిగా విజయవాడ నగర ప్రజలను కోరారు. వడ్డీ లేకుండా ప్రస్తుత అర్థ సంవత్సరమునకు పన్ను చెల్లించుటకు గాను కేవలం రెండు రోజులు మాత్రమే గడువు ఉన్నదని ప్రజలు గమనించాలని కమిషనర్ అన్నారు. ఆదివారము సెలవు దినమైన అయినప్పటికీ నగర ప్రజలు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో వడ్డీ లేకుండా పనులు చెల్లించేందుకు ఆదివారం కూడా విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న అన్ని క్యాష్ కౌంటర్లు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటాయని తెలియజేశారు. కావున ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నగరపాల సంస్థకు చెల్లించవలసిన అన్ని రకముల పనులను మూడు సర్కిల్ పరిధిలో గల క్యాష్ కౌంటర్లలో సకాలంలో చెల్లించి నగరాభివృద్ధికి సహకరించవలసిందిగా నగర పౌరులను కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *