Breaking News

స్పందన అర్జీలను అలసత్వం లేకుండా సత్వర పరిష్కారం చూపాలి : జిల్లా జాయింట్ కలెక్టర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీలను అలసత్వం లేకుండా అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని నిర్దేశించిన గడువు లోపల స్పందన అర్జీలకు అర్థవంతoగా పరిష్కారం చూపాలని జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం కలెక్టరేట్ లో నిర్వహించిన స్పందన కార్యక్రమoలో… జాయింట్ కలెక్టర్ డి.ఆర్. ఓ పెంచల కిషోర్ తో పాటు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు కే.పి.శ్రీనివాస్, భవాని శంకర్, భాస్కర నాయుడు, కలెక్టరేట్ ఏ. ఓ జయరాములు కలిసి జిల్లాలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి వినతులను స్వీకరించి, స్పందన ఆన్లైన్ నమోదుతో రసీదులు అందించారు.

శాఖల వారీగా అర్జీల వివరాలు :
రెవెన్యూ శాఖ – 169,
పోలీస్ శాఖ – 7, డి.పి. ఓ -2, డి.ఎల్.పి. ఓ -3, డి.ఎం.హెచ్. ఓ -2, విద్యుత్ శాఖ -2, జిల్లా పట్టు పరిశ్రమల శాఖ-1, మునిసిపల్ కమిషనర్ -5, జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం – 1, చేనేత -1, డి.ఆర్.డి.ఏ -1, ఆర్.డబ్ల్యు.ఎస్ -3, దేవాదాయ శాఖ -1, హౌసింగ్ -2, ఎం.పి.డి. ఓ -1, వెరసి మొత్తం 201 వినతులు రావడం జరిగిందని జిల్లా అధికారులు అందురు వచ్చిన అర్జీలను వేగవంతంగా పరిష్కరించాలని స్పందనకు హాజరయిన వివిధ శాఖలకు సంబందించిన జిల్లా అధికారులను జాయింట్ కలెక్టర్ ఆదేశించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

తీవ్ర వాయుగుండం నేపథ్యంలో ఆర్‌ & బీ శాఖ అధికారులతో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి టెలికాన్ఫరెన్స్‌

-క్షేత్రస్థాయి ఆర్‌ & బీ శాఖ అధికారులను అప్రమత్తం చేసిన మంత్రి -సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రజల రాకపోకలకు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *