డిక్లరేషన్ తీసుకున్న తర్వాతనే పరిశీలించి ఓటు కల్పించడం జరుగుతుంది…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
నూతన ఓటు కోసం 20ఏళ్ల పైబడిన కూడా వారు దరఖాస్తు చేసున్నారని, వారి నుండి తమకు ఎక్కడా ఓటు లేదని డిక్లరేషన్ తీసుకున్న తర్వాతనే పరిశీలించి ఓటు కల్పించడం జరుగుతుందని, ఇచ్చిన డిక్లరేషన్ మేరకు సమాచారం వాస్తవం కాకుంటే తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నగర కమిషనర్, తూర్పు నియోజకవర్గ ఈఆర్ఓ కీర్తి చేకూరి తెలిపారు. మంగళవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటర్ల జాబితా స్పెషల్ సమ్మరి రివిజన్ 2024 పై ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నూతన ఓటు కోసం దరఖాస్తు చేసున్న వారి నుండి వాస్తవ సమాచారం ఇస్తున్నామని, ఓటు కోసం ఇచ్చిన సమాచారం వాస్తవం కాకుంటే తదుపరి చట్టపరమైన చర్యలు తమపై తీసుకోవచ్చని డిక్లరేషన్ తీసుకుంటున్నామన్నారు. ప్రస్తుతం దరఖాస్తు చేస్తున్న ఫారం-6 లను ప్రత్యేకంగా బిఎల్ఓలు, ఎన్నికల సూపర్వైజరి అధికారులు పరిశీలించిన రిమార్క్స్ తోనే తదుపరి ఆమోదం కోసం పంపాలని ఆదేశించామని పేర్కొన్నారు. డిసంబర్ 10 తర్వాత తూర్పులో 4 వేలు, పశ్చిమ నియోజకవర్గంలో 2 వేలు వివిధ క్లైమ్స్ అందాయని వాటి పరిష్కారానికి బిఎల్ఓల వారిగా రిపోర్ట్ పంపామని తెలిపారు. ఎన్నికల విభాగంకు రెవెన్యూ శాఖ నుండి ఇద్దరు డిప్యూటీ తహసిల్దార్ లను డెప్యూట్ చేశామన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు సమావేశాల్లో అందించిన ఫిర్యాదులు, అర్జీలను క్రమ పద్దతిలో రికార్డ్ చేసి, క్షేత్ర స్థాయి పరిశీలనకు బిఎల్ఓలకు పంపాలని ఆదేశించారు.
సమావేశంలో పశ్చిమ నియోజకవర్గ ఈఆర్ఓ, అదనపు కమిషనర్ కె.లక్ష్మీ శివ జ్యోతి, సూపరిండెంట్ సాంబశివరావు, ఎన్నికల విభాగం డిప్యూటీ తహసిల్దార్ బి.భాస్కర్రావు, ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలైన వైఎస్సార్సీపి నుండి జాన్ బాబు, టిడిపి నుండి ఓంకార్, బిఎస్పి నుండి వాసు, బిజెపి నుండి భాస్కర్రావు, అమ్ఆద్మీ నుండి సేవాకుమార్, కాంగ్రెస్ నుండి జానిభాష పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *