ఉద్యోగాల పేరిట నిరుద్యోగ యువత మోసపోవద్దు

-సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకులు బి. శ్రీనివాసరావు 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో పాఠశాలల్లో ఆత్మరక్షణ కార్యక్రమం (సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనింగ్) కింద పని చేయడానికి ‘యండ్రపల్లి శివ, మేనేజింగ్ డైరెక్టర్, యూత్ యోగా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, విజయవాడ, ఆంధ్రప్రదేశ్’ పేరిట ఉద్యోగాలు కల్పిస్తున్నట్లు వాట్సాప్ తదితర సామాజిక మాధ్యమాల్లో ప్రచారం అవుతున్న లేఖ మోసపూరితమని సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు  ఒక ప్రకటనలో తెలిపారు. సమగ్ర శిక్ష తరఫున పాఠశాలల్లో పని చేయడానికి ప్రస్తుతం ఎలాంటి ఉద్యోగ ప్రకటనలు ఇవ్వలేదని, నిరుద్యోగ యువత నుంచి డబ్బులు వసూలు చేయడానికే కొందరు ఇలాంటి మోసపూరితమైన ప్రకటనలు చేస్తున్నారని వెల్లడించారు. యువత, వారి తల్లిదండ్రులు మోసపోకుండా అప్రమత్తమవ్వాలని కోరారు. యండ్రపల్లి శివ ,మేనేజింగ్ డైరెక్టర్, యూత్ యోగా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, విజయవాడ, ఆంధ్రప్రదేశ్ వారికి సమగ్ర శిక్షాకు ఎలాంటి సంబంధం లేదని, ఆ పేరుతో సమగ్ర శిక్షా కార్యాలయం నుండి ఎటువంటి ఉత్తర్వులు ఇవ్వలేదని సమగ్ర శిక్షా ఎస్పీడీ బి.శ్రీనివాసరావు  తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *