Breaking News

మున్సిపల్ పాఠశాలల ఉపాధ్యాయుల మెడికల్ రియంబర్స్ మెంట్ బిల్లుల ఆన్ లైన్ ద్వారా అప్ లోడ్ చేయాలి

– పాఠశాల విద్యాశాఖ కమీషనర్ ఎస్.సురేష్ కుమార్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంద్రప్రదేశ్ రాష్ట్రం నందు గల అన్ని మున్సిపల్ స్కూల్స్ యాజమాన్యాల ఉపాధ్యాయులు సర్వీస్ మ్యాటర్స్ అన్నీ పాఠశాల విద్యాశాఖ, కమీషనర్ కి బదిలీ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మున్సిపల్ యాజమాన్యాల్లో పని చేస్తున్న ఉపాధ్యాయుల మెడికల్ రియంబర్స్ మెంట్ బిల్లుల వారి DDO ద్వారా ఆన్ లైన్ లో నేరుగా YSR TRUST, EHS పోర్టల్ నందు అప్ లోడ్ చేయడానికి పాఠశాల విద్యాశాఖ కమీషనర్ ఎస్.సురేష్ కుమార్ ESE02-24021/11/2021 MDCL-CSE, Dt. 04/1/2024 ద్వారా ఉత్తర్వులు జారీ చేశారు. మున్సిపల్ స్కూల్స్ యాజమాన్యంలో పని చేసే బోధనా సిబ్బంది ఆన్ లైన్ ద్వారా మాత్రమే బిల్లులు సమర్పించాలని కోరారు. మాన్యువల్ గా సమర్పించిన బిల్లులు అనుమతించమని తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఇంద్రకీలాద్రిపై భక్తులకు సరికొత్త సేవలు- రాష్ట్రంలోనే తొలిసారిగా ‘లడ్డూ ప్రసాదం ఏటీఎం’ ప్రారంభం

ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం (ఇంద్రకీలాద్రి) కొండ దిగువన, అర్జునవీధి ప్రారంభంలోని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *