Breaking News

ఘనంగా వినియోగదారుల దినోత్సవం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఇండియన్ ఆయిల్ వినియోగదారుల దినోత్సవ వేడుకలు బందరు రోడ్డులోని ఇండియన్ ఆయిల్ పైలెట్ సర్వీస్ స్టేషన్, పెట్రోల్ బంక్లో ఆదివారం ఐఓసిఎల్ ప్రతినిధులు పాల్గొని వినియోగదారులతోనే కేక్ కట్ చేయించి, వినియోగదారులకు, సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భముగా వినియోగదారులకు స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భముగా ఐఓసిఎల్ ఛీఫ్ డివిజనల్ రిటైల్ హెడ్ అనీల్ మాట్లాడుతూ నాణ్యమైన ఉత్పత్తులను మరియు కాలుష్య రహిత పెట్రోలు ఎక్స్పో 95ను ఉపయోగించుకోవలసినదిగా వినియోగదారులకు సూచించినారు. కె.వి.యస్. పవన్ కుమార్, ఛీఫ్ మేనేజర్ మాట్లాడుతూ వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఐఓసీఎల్ నాణ్యమైన ఇంధనాలను అందిస్తున్నట్లుగాను, అందుకు వినియోగదారులు ఆదరిస్తున్నందుకు శుభాకాంక్షలు తెలియజేసినారు. కొమ్మోజు వరప్రసాద్, యన్టిఆర్ జిల్లా సేల్స్ ఆఫీసర్ గారు మాట్లాడుతూ ఈ రోజు నుంచి ఫిబ్రవరి 15వ తేది వరకు ఎక్స్ట్రా రివార్డ్స్ సౌకర్యము వినియోగించుకొని, తద్వారా ఉచిత పెట్రోలు మరియు ఎక్స్ట్రా రివార్డు పాయింట్స్ శాశ్వతంగా పొందే అవకాశం కల్పిస్తున్నట్లు చెబుతూ, నగరంలోని వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పై కార్యక్రమములో డీలర్ యం.వి.వి. సత్యనారాయణ మరియు నంద కిషోర్, మేనేజర్ కె.వెంకటప్పయ్య తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *