స్త్రి పురుష లింగ నిష్పత్తి తక్కువగా ఉన్న ప్రాంతాలపై దృష్టి సారించాలి

-వైద్య, రెవెన్యూ, పోలీసు అధికారులు సంయుక్తం గా డేకాయట్ ఆపరేషన్స్ నిర్వహించాలి
-కలెక్టర్ మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
శనివారం సాయంత్రం స్థానిక కలెక్టర్ కార్యాలయము నందు జిల్లా మెజిస్ట్రేట్ వారి ఛాంబర్ నందు జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవి లత అధ్యక్షతన పిసిపిఎన్ డిటి చట్టం అమలు చెయ్యడం పై జిల్లా అప్రాప్రియటే అథారిటీ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఏర్పాటు చేయడమైనది.

ఈ సందర్భంగా కలెక్టర్ , కమిటీ చైర్ పర్సన్ డాక్టర్ కె మాధవిలత  మాట్లాడుతూ డెకాయ్ ఆపరేషన్ చేసే సమయంలో హాస్పిటల్లో వారికి తెలియకుండా వెళ్లి ఆకస్మికంగా తనిఖీ నిర్వహించాలన్నారు. ఈ తనిఖీల సమయంలో స్థానిక పోలీస్, రెవెన్యూ , ఆరోగ్య శాఖల వారు సంయుక్తంగా డెకాయ్ ఆపరేషన్ నిర్వహించాలని ఆదేశించారు.

అదేవిధంగా జననాల సందర్బంలో స్త్రీ పురుష లింగ నిష్పత్తి తక్కువగా ఉన్న  ప్రాంతాలలో పై ప్రత్యేక దృష్టి పెట్టాలని స్పష్టం చేశారు. జిల్లాలో తక్కువ ఉన్న వాటిని గుర్తించడం తో పాటు గా లింగ నిష్పత్తి సమతుల్యం కావడానికి కృషి చేయాలన్నారు. తొలుత కార్యక్రమంలో జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ ఎన్ రాజకుమారి కమిటీ సభ్యులకు ఆహ్వానం పలికి జిల్లాలో అమలవుతున్న పీసీపీ అండ్ టీ యాక్ట్ పరిధిలో రిజిస్టర్ అయిన స్కానింగ్ సెంటర్ లపై మీటింగ్ అజెండాను కమిటీ సమావేశం లో వివరించారు.

జిల్లాలో 148 స్కానింగ్ సెంటర్లో ఉన్నాయని కొత్తగా మూడు స్కానింగ్ సెంటర్ల రిజిస్ట్రేషన్ కొరకు ఆరు రెన్యువల్స్ కొరకు మూడు మోడిఫికేషన్ కొరకు అనుమతుల కోరడమైనది తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డి ఎమ్ హెచ్ వో డాక్టర్ ఎన్ వసుంధర, జిల్లా స్త్రీ శిశు సంక్షేమ అధికారి కె.విజయ్ కుమారి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఐ సి శంభు ప్రసాద్, డిప్యూటీ డిఎంహెచ్వోలు శ్రీహరి, సంధ్య ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *