విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరంలో రోడ్డు ప్రమాదాలను నివారించడానికి యన్.టి.ఆర్ జిల్లా పోలీసు కమీషనర్ క్రాంతి రాణా టాటా, ఐ.పి.ఎస్ వారి అదేశాల మేరకు నగరంలో వివిధ ప్రదేశాలలో మద్యం సేవించి వాహనములు నడిపే చోదకులపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగినది. ఈ నేపధ్యంలో ది.03-02-2024 వ తేదిన 5వ ట్రాఫిక్ పోలీసు వారు మొత్తం 62 కేసులలో మద్యం సేవించి వాహనములు నడిపే చోదకులను VI వ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ వారి న్యాయస్థానంలో ప్రవేశపెట్టగా, న్యాయమూర్తి జి.లెనిన్ బాబు, 55 మంది వ్యక్తులకు ఒక్కొక్కరికి రూ.10,000/- చొప్పున మరియు మిగిలిన 7 మంది వ్యక్తులకు ఒక్కొక్కరికి రూ.15,000/- చొప్పున జరిమానా విధించడం జరిగింది. ప్రతి రోజు ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమాలు నిర్వహించి పట్టుబడిన వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుంది. కాబట్టి వాహన చోదకులు ట్రాఫిక్ నియమ నిబంధనలు, మోటార్ వాహన చట్టాలను పాటిస్తూ సురక్షితంగా ప్రయాణం చేయాలని నగర పోలీస్ కమీషనర్ కాంతి రాణా టాటా ఐ.పి.ఎస్. తెలియజేయటం జరిగింది.
Tags vijayawada
Check Also
అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం
-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …
Prajavartha Online Telugu News