ఫిబ్రవరి 9వ తేదీన మినీ జాబ్ మేళా

-జిల్లా ఉపాధి అధికారి హరిశ్చంద్ర ప్రసాద్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు గోదావరి జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో ఈ నెల 09-02-2024 వ తేదీ శుక్రవారం ఉదయం 09:30 గంటలకు క్యూస్ కార్ప్, శ్రీ రామ్ లైఫ్ ఇన్సూరెన్స్ వంటి కంపెనీలు బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్, బ్రాంచ్ రీలేషన్ షిప్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ కొరకు జిల్లా ఉపాధి కార్యాలయం, షెల్టన్ హోటల్ సమీపంలో, HP పెట్రోల్ పంప్ వెనుక, రాజమహేంద్రవరం, తూర్పు గోదావరి జిల్లా నందు మినీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కె .హరిచంద్ర ప్రసాద్ తెలిపారు. ఎంపికైన అభ్యర్థులు రాజమహేంద్రవరం, తూర్పు గోదావరి పరిధిలోని ప్రాంతాలలో పనిచేయాల్సి ఉంటుందన్నారు. పదో తరగతి, డిప్లొమా ,ఐ టి ఐ, ఇంటర్, డిగ్రీ, పి.జి వరకు చదువుకున్న 18-45 సం.ల వయసు గల నిరుద్యోగ యువతీ, యువకులు అర్హులు. వీరికి జీతం రు. 15,000/- to 25,000/- రూపాయల వరకు ఉంటుందని తెలిపారు. మరింత సమాచారం, సహాయం కొరకు 8247437773 నెంబర్ సంప్రదించగలరని పేర్కొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *