పాల సేకరణ సిద్దం చేసిన జంబు పట్నం ” బి ఎమ్ సీ యూ”

-బుధవారం రాత్రికి ట్రైల్ రన్ పూర్తి చెయ్యాలి
-జే సి తేజ్ భరత్

కోరుకొండ, నేటి పత్రిక ప్రజావార్త :
జంబూపట్నం బల్క్ మిల్క్ యూనిట్ ద్వారా పాల శీతలీకరణ కోసం 46 జగనన్న పాల సేకరణ కేంద్రాలు ద్వారా సేకరణ కోసం గ్రామ సభలు నిర్వహించి తీర్మానం చెయ్యడం జరిగిందనీ జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ తెలియ చేశారు. బుధవారం సాయంత్రం కోరుకొండ మండలం జంబూపట్నం గ్రామంలో ఏర్పాటు చేసిన “బీ.ఎమ్.సీ.యూ” నీ పరిశీలించారు.

ఈ సందర్భంగా జేసి ఎన్. తేజ్ భరత్ మాట్లాడుతూ , మార్చి ఒకటీ నుంచి జంభూపట్నం – బీ.ఎమ్.సి.యూ పూర్తి స్థాయిలో అందుబాటు లోకి  తీసుకుని రావడం జరుగుతోందనీ అన్నారు.  గుజరాత్ నుంచి పాల శీతలీకరణ కేంద్రనికి చెందిన పరికరాలు చేరాయని, సాంకేతిక బృందం ఆద్వర్యంలో సంభందిత మిషనరీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈరోజు రాత్రికి ట్రైల్ రన్ పూర్తి చెయ్యాలని ఆదేశించారు. జంబూ పట్నం పరిధిలో 46 జగనన్న పాల వెల్లువ సేకరణ కేంద్రాలను గుర్తించడం, ఆ మేరకు తీర్మానాలు చేసి అనుసంధానం చేసినట్లు తెలిపారు. జిల్లాలో పాడి రైతుల నుంచి పాల సేకరణ ప్రక్రియ వేగవంతం చేస్తున్నట్లు  పేర్కొన్నారు. రాజమండ్రీ డివిజన్ పరిధిలో మరిన్ని బి ఎమ్ సీ యూ లని రానున్న రోజుల్లో ఏర్పాటు చేయడం జరుగుతుందనీ అన్నారు. ఈ బీ ఎమ్ సీ యూ పరిదిలో 46 జగనన్న పాల వెల్లువ కేంద్రాల ద్వారా పాలసేకరణ చేపట్టడం జరుగుతుందనీ అన్నారు. తొలి దశలో 5 వేల లీటర్ల పాల సేకరణ  లక్ష్యంగా చేసుకుని కార్యచరణ అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఒకొక్క కేంద్రం ద్వారా రోజుకి 160 లీటర్ల పాలు సేకరణ ఉదయం 80 లీటర్లు, సాయంత్రము 80 లీటర్లు లక్ష్యం సాధించేలా ప్రణాళిక సిద్ధం చేసినట్లు తేజ్ భరత్ పేర్కొన్నారు. బల్క్ మిల్క్ యూనిట్ ఏర్పాటు చేసే సాంకేతిక బృందం ఆద్వర్యంలో మిషనరీ ఏర్పాటు ను పర్యవేక్షణ బాధ్యతలను మండల స్థాయి అధికారులు వ్యక్తిగత బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పశు సంవర్ధక అధికారి డా. ఏస్ జి టి సత్య గోవింద్,  ఎపి ఎస్ పిడిసీఎల్ ఏస్ ఈ టి వి యస్ ఎన్ మూర్తి, కోరుకొండ ఎంపీడీవో హేమ సుందర్, ఇతర అధికారులు, లబ్దిదారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *