-జే సి తేజ్ భరత్
రాజానగరం, నేటి పత్రిక ప్రజావార్త :
భూపాల పట్నం బల్క్ మిల్క్ యూనిట్ ద్వారా శీతలీకరణ కోసం 46 జగనన్న పాల సేకరణ కేంద్రాలు అనుసంధానం చేస్తూ గ్రామ సభలు ద్వారా తీర్మానం చెయ్యడం జరిగిందనీ జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ తెలియ చేశారు.
బుధవారం రాజానగరం మండలం భూపాల పట్నం గ్రామంలో ఏర్పాటు చేయనున్న “బీ ఎమ్ సీ యూ” నీ పరిశీలించారు. ఈ సందర్భంగా జేసి తేజ్ భరత్ మాట్లాడుతూ , మార్చి ఒకటీ నుంచి భూపాలపట్నం బీ ఎమ్ సీ యూ పూర్తి స్థాయిలో అందుబాటు లోకి తిసుకుని రావాలన్నారు. గుజరాత్ నుంచి పాల శీతలీకరణ కేంద్రనికి చెందిన పరికరాలు చేరాయని, వాటినీ ఈరోజు రాత్రికి మిషనరీ ఏర్పాటు చేసి, రేపు ట్రైల్ రన్ పూర్తి చెయ్యాలని ఆదేశించారు. జిల్లాలో అమూల్ పాల సేకరణ కేంద్రాలు ద్వారా పాడి రైతుల నుంచి సరైన మద్దతు ధరను అందిస్తూ పాల సేకరణ ప్రక్రియ వేగవంతం చేస్తున్నట్లు పేర్కొన్నారు. జగనన్న పాల వెల్లువ అమూల్ కేంద్రాల ద్వారా పాలసేకరణ చేపట్టడం జరుగుతోందనీ అన్నారు. ప్రస్తుతం సుమారు 5 వేల లీటర్ల పాల సేకరణ లక్ష్యంగా చేసుకుని కార్యచరణ అమలు చెయ్యాలని అధికారులని ఆదేశించారు. తొలిదశలో ఒకొక్క కేంద్రం ద్వారా రోజుకి 160 లీటర్ల పాలు సేకరణ లక్ష్యం సాధించేలా ప్రణాళిక సిద్ధం చేసినట్లు తేజ్ భరత్ పేర్కొన్నారు. బల్క్ మిల్క్ యూనిట్ ఏర్పాటు చేసే సాంకేతిక బృందం ఆద్వర్యంలో మిషనరీ ఏర్పాటు ను పర్యవేక్షణ బాధ్యతలను మండల స్థాయి అధికారులు వ్యక్తిగత బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పశు సంవర్ధక అధికారి డా. ఏస్ జి టి సత్య గోవింద్, ఎపి ఎస్ పిడిసీఎల్ ఏస్ ఈ టి వి యస్ ఎన్ మూర్తి, రాజానగరం ఎంపీడీవో జి ఏ కే ఎన్ వి జ్యోతిర్మయి , ఇతర అధికారులు, పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News