Breaking News

పదో తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి

-తూర్పుగోదావరి జిల్లాలో 30116 మంది విద్యార్థులకు 137 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు.
-అయిదు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ల ఏర్పాటు
-సమస్యాత్మక సెంటర్లపై ప్రత్యేక నిఘా
-డిఆర్వో జి నరసింహులు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
మార్చి 18వ తేదీ నుంచి 30 వ తేదీ వరకు నిర్వహించనున్న 10వ తరగతి పరీక్షలను పకడ్బందీగా, పారదర్శకంగా, నిస్పక్షపాతంగా నిర్వహించేలా ముందస్తు ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ డా. మాధవీ లత ఆదేశాల మేరకు వీఆర్వో జి.నరసింహులు సంబంధిత అధికారులతో సమీక్షించారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని డిఆర్ఓ ఛాంబర్ లో పదవ తరగతి పరీక్షల నిర్వహణకు సంబంధించి వివిధ సమన్వయ శాఖల అధికారులు సిబ్బందితో డిఆర్ఓ నరసింహులు సమీక్ష సమావేశం నిర్వహించారు.

డి ఆర్ ఓ జి నరసింహులు మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లాలో 2024 మార్చి 18 నుండి నిర్వహించే పదవ తరగతి పరీక్షలకు సంబంధించి మొత్తం 30116 మంది హాజరుకానున్నారని, వీరిలో బాలురు 15819 మంది, బాలికలు 14297 మంది ఉన్నారని, వీరిలో రెగ్యులర్, ప్రైవేట్ విద్యార్థినీ విద్యార్థులు 29990 మంది కాగా ఓ ఎస్ ఎస్ సి ప్రైవేట్ విద్యార్థిని విద్యార్థులు 126 మంది ఉన్నారన్నారు.

జిల్లాలో 137పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్షలు ప్రతి రోజు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు జరుగుతాయన్నారు. విద్యార్థులను 8.45కు కేంద్రాల్లోకి అనుమతిస్తామన్నారు. ఆలస్యంగా వచ్చిన వారిని కేంద్రంలోకి అనుమతించేది లేదని స్పష్టం చేశారు

సరిగ్గా ఎన్నికల ముందు నిర్వహించే పదవతరగతి పరీక్షలను ఎంతో జాగ్రత్తగా నిర్వహించాలని అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండి ఎటువంటి పొరబాట్లు దొర్లకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో 137 పరీక్షా కేంద్రాలను ముందుగానే ఒకసారి తనిఖీ చేయాలని సూచిస్తూ, ఏమైనా లోటుపాట్లు ఉంటే ముందుగానే చక్కదిద్దాలన్నారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద ఓఆర్ఎస్ ప్యాకెట్లు, బీపీ, షుగర్ చెక్ చేసే పరికరాలు, అత్యవసర మందులతో వైద్యారోగ్యశాఖ సిబ్బంది ఒకరు అందుబాటులో ఉండాలన్నారు. అన్ని కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలులో ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు.

మాస్‌ కాపీయింగ్‌ను నిరోధించేందుకు 5 ఫ్లయింగ్‌ స్క్వాడ్లను ఏర్పాటు చేశామని, స్క్వాడ్స్‌ ప్రతిరోజూ ఆయా కేంద్రాలను తనిఖీ చేస్తాయన్నారు. అలాగే సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక దృష్టిపెట్టారన్నారు. పరీక్షల విధుల్లో ఉన్నవారు మినహా బయటి వ్యక్తులను కేంద్రాల్లోకి అనుమతించరని దివ్యాంగులకు అవసరమైతే స్క్రయిబ్ ను ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం కల్పించారన్నారు.

పదవ తరగతి పరీక్షల నిర్వహణకు జిల్లాలో 137 కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అలాగే విధులు నిర్వహణకు గాను డిఓ లు 237, ఏ డి ఓ లు 6, ఇన్విజిలేటర్స్ 1255, స్క్వాడ్స్ 5, సి- కార్ కస్టోడియన్స్ 19 నియమించడం జరిగిందని పేర్కొన్నారు.

ఈ సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ.. పి. అనిల్ కుమార్, జిల్లా విద్యాశాఖ అధికారి కే వాసుదేవరావు, డిప్యూటీ డీఈవో ఈవీఎస్ఎస్ఎస్ విఎల్ నారాయణ, జిల్లా రవాణా అధికారి కే ఎస్ ఎం వి కృష్ణా రావు, డి టి వో ఎన్. వి సత్యనారాయణ, మున్సిపల్, పంచాయితీ, వైద్య ఆరోగ్య, ఆర్టిసి, పోస్టల్, సమాచార, పోలిస్ , తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *