Breaking News

ఓటింగ్ శాతం పెరిగేలా చూడడంలో బిఎల్వో లదే కీలక పాత్ర

-ఓటింగ్ పెంచే క్రమంలో పిఏస్ వారీగా రూట్ మ్యాప్ అందచేయాలి
-ఆయా పోలింగ్ కేంద్రాల ఓటర్ల లో చైతన్యం తీసుకుని రావాలి
-ఈ వి ఎమ్ లపై అవగాహన కల్పించాలి
-జిల్లా ఎన్నికల అధికారి కె. మాధవీలత

నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త :
నియోజక వర్గ స్థాయి లో ఓటు హక్కు కలిగిన ప్రతీ ఒక్కరూ పోలింగ్ కేంద్రాలకి వొచ్చి ఓటు హక్కును వినియోగించుకునేలా తగిన చర్యలు తీసుకోవాలని , ఈ వి ఎమ్ లపై అవగాహన పెంచాల్సి ఉందని కలెక్టరు, జిల్లా ఎన్నికల అధికారి కె. మాధవీలత పేర్కొన్నారు.

బుధవారం నిడదవోలు మోడరన్ రూఫ్ జూనియర్ కాలేజి , 8 , 9 వార్డు సచివాలయం ప్రాంతాలలోని పోలింగ్ కేంద్రాలను ఆర్వో తో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ , నిడదవోలు నియోజక వర్గంలో 2019 ఎన్నికల్లో 85.02 శాతం ఓటింగ్ నమోదు అయినట్లు తెలిపారు. నియోజక వర్గ సగటు కంటే తక్కువ పోలింగ్ జరిగిన పి ఏస్ వారిగా వివరాలు మీకు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఆమేరకు గత ఎన్నికల్లో ఓటింగ్ శాతం తక్కువ గా నమోదు అయిన పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక స్వీప్ కార్యకలాపాలను చేపట్టాల్సి ఉందన్నారు. జిల్లాలో గత ఎన్నికల్లో నియోజక వర్గాల వారీగా తక్కువ ఓటు నమోదు చేసిన పి ఎస్ లను గుర్తించి, రాజకీయా పార్టీలతో కలిసి అక్కడ ప్రత్యేక ప్రచార కార్యక్రమాల ను చెప్పట్టాల్సి ఉందన్నారు. రాజ్యాంగ కల్పించిన ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు స్వచ్ఛందంగా ముందుకు రావాలని కోరారు. అందులో భాగంగానే గత సార్వత్రిక ఎన్నికల్లో నిడదవోలు నియోజక వర్గం పరిధిలోని పి ఎస్ లలో నియోజక వర్గం సగటు ఓటు నమోదు 85.02 శాతం కంటే తక్కువ నమోదు అయిన 67.88 శాతం 73.93 శాతం వరకు ఉన్న పోలింగ్ కేంద్రాల బి ఎల్ వో లతో కలెక్టర్ క్షేత్ర స్థాయిలో సమీక్ష నిర్వహించారు. క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితిని అధ్యయనం చేసెందుకు పర్యటించినట్లు కలెక్టర్ పేర్కోన్నారు.  ఓటర్ల లో చైతన్యం తీసుకుని రావడం కోసం తగిన ప్రణాళికలు, కార్యచరణ సిద్ధం చెయ్యాలని ఆర్వో ను ఆదేశించారు. ఓటింగ్ శాతం పెరిగేలా బి ఎల్ వో లు ఇంటింటికి తిరిగి చైతన్యం తీసుకుని రావాలన్నారు. ఈవిఎమ్ మిషన్ లపై అవగాహన కల్పించడం , రాబోయే ఎన్నికల్లో రాజకీయ పార్టీల ప్రతినిధులను కలుపుకుని వెళ్ళి, ఓటింగ్ శాతం పెరిగేలా సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.

కలెక్టర్ వెంట నిడదవోలు నియోజక వర్గం రిటర్నింగ్ అధికారి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఆర్ వి రమణా నాయక్  ,  తహసిల్దార్ నాగభూషణం, బిఎల్వో లు, ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పాఠశాల బస్సు డ్రైవర్లు నిబద్ధతతో విధులు నిర్వహించాలి

-విద్యార్థుల భద్రత డ్రైవర్లపై ఉన్న అత్యంత కీలక బాధ్యత -డ్రైవర్లు విధిగా యూనిఫామ్ ధరించాలి -డ్రైవింగ్ నైపుణ్యంతో పాటు మంచి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *