-క్షేత్ర స్థాయిలో బి ఎల్ వో లు, సెక్టోరల్ అధికారులతో సమీక్ష
-ఓటర్ల తో కలెక్టర్ మాధవీలత ముఖాముఖి
-పోలింగ్ కేంద్రాల లో మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యతా ఇవ్వాలి
-జిల్లా ఎన్నికల అధికారి కె. మాధవీలత
కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
కొవ్వూరు నియోజక వర్గ స్థాయి లో ప్రతి పోలింగ్ కేంద్రంలో మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి పెట్టడం, గత ఎన్నికల్లో తక్కువ పోలింగ్ నమోదు అయిన పోలింగ్ కేంద్రాల పరిధిలో ఓటింగ్ శాతం పెరిగేలా తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టరు, జిల్లా ఎన్నికల అధికారి కె. మాధవీలత పేర్కొన్నారు.
బుధవారం కొవ్వూరు లో సంస్కృత కళాశాల, సంస్కృత ఉన్నత పాఠశాల, ఎస్ ఎ ఎన్ జెడ్పీ బాలికొన్నత పాఠశాలలో ఉన్న పోలింగ్ కేంద్రాలను ఆర్వో తో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ , కొవ్వూరు నియోజక వర్గంలో 2019 ఎన్నికల్లో 86.41 శాతం ఓటింగ్ నమోదు అయినట్లు తెలిపారు. నియోజక వర్గ సగటు కంటే తక్కువ పోలింగ్ జరిగిన పి ఏస్ వారిగా వివరాలు మీకు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. స్ట్రాంగ్ రూమ్ వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలన్నారు. గత ఎన్నికల్లో ఓటింగ్ శాతం తక్కువ గా నమోదు అయిన పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక స్వీప్ కార్య కలాపాలను చేపట్టాల్సి ఉందన్నారు. జిల్లాలో గత ఎన్నికల్లో నియోజక వర్గాల వారీగా తక్కువ ఓటు నమోదు చేసిన పి ఎస్ లను గుర్తించి, రాజకీయా పార్టీలతో కలిసి అక్కడ ప్రత్యేక ప్రచార కార్యక్రమాల ను చెప్పట్టాల్సి ఉందన్నారు. రాజ్యాంగ కల్పించిన ఓటు హక్కును వినియోగించు కునేందుకు ఓటర్లు స్వచ్ఛందంగా ముందుకు రావాలని కోరారు. అందులో భాగంగానే గత సార్వత్రిక ఎన్నికల్లో కొవ్వూరు నియోజక వర్గం పరిధిలోని పి ఎస్ లలో నియోజక వర్గం సగటు ఓటు నమోదు 86.41 శాతం కంటే తక్కువ నమోదు అయిన 69.12 శాతం 76.97 శాతం వరకు ఉన్న పోలింగ్ కేంద్రాల బి ఎల్ వో లతో కలెక్టర్ క్షేత్ర స్థాయిలో సమీక్ష నిర్వహించారు. ఆర్వో, ఈ ఆర్వో లు, సెక్టరల్ అధికారులు తో కలిసి క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితిని అధ్యయనం చేసెందుకు పర్యటించినట్లు కలెక్టర్ పేర్కోన్నారు. ఓటర్ల లో చైతన్యం తీసుకుని రావడం కోసం తగిన ప్రణాళికలు, కార్యచరణ సిద్ధం చెయ్యాలని ఆర్వో ను ఆదేశించారు. ఓటింగ్ శాతం పెరిగేలా బి ఎల్ వో లు ఇంటింటికి తిరిగి చైతన్యం తీసుకుని రావాలన్నారు. ఈవిఎమ్ మిషన్ లపై అవగాహన కల్పించడం , రాబోయే ఎన్నికల్లో రాజకీయ పార్టీల ప్రతినిధులను కలుపుకుని వెళ్ళి, ఓటింగ్ శాతం పెరిగేలా సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ పర్యటన సమయంలో పలువురు ఓటర్ల తో కలెక్టర్ ముఖాముఖి సంభాషణ చెయ్యడం జరిగింది.
కలెక్టర్ వెంట కొవ్వూరు నియోజక వర్గం రిటర్నింగ్ అధికారి , సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ, తహసిల్దార్ కె. మస్తాన్, మునిసిపల్ కమీషనర్ బి. శ్రీకాంత్, బిఎల్వో లు, ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News