Breaking News

ప్రత్యేక మహిళా కారాగారాన్ని సందర్శన

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
బుధవారం సాయంత్రం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ కె. ప్రత్యూష కుమారి రాజమహేంద్రవరం ప్రత్యేక మహిళా కారాగారాన్ని సందర్శించి కారాగారంలోని సదుపాయాలను పరిశీలించారు. అనంతరం ఖైదీలతో మాట్లాడారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైన సహనంగా ఉండాలని, ఆవేశంలో చేసిన పనుల వల్ల తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని తెలిపారు. ఉచిత న్యాయ సేవలు పొందడం ఖైదీల హక్కు అని, ఖైదీల తరపున వాదించేందుకు న్యాయవాది లేని వారికి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఉచితంగా న్యాయవాదిని నియమిస్తామని, ఈ సేవలను అందరూ వినియోగించుకోవాలని అన్నారు. ఎలాంటి న్యాయ సహాయం అవసరమైనా పారా లీగల్ వాలంటీర్ల ద్వారా జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు తెలియజేయాలన్నారు.

అనంతరం 9వ అదనపు జిల్లా న్యాయమూర్తి ఎం. మాధురి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె. ప్రత్యూష కుమారి పానల్ న్యాయవాదులు మరియు డిఫెన్స్ కౌన్సిల్ న్యాయవాదులతో మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఉచిత న్యాయ సహాయం అందిస్తున్న కోర్టు కేసుల వివరాలను, బెయిల్ పిటిషన్లు, అప్పీళ్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు, కేసులను సత్వరం పరిష్కరించేందుకు ఏ విధమైన చర్యలు తీసుకోవాలని వివరించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *