Breaking News

జగనన్న భరోసా – అభివృద్ధిలో రాజానగరం ముందంజ…

-పాలనలో ప్రజలకు మెరుగైన సౌకర్యాలు…
-రాజానగరం నియోజకవర్గంలో అభివృద్ధిలో గణనీయమైన పురోగతి, మరింత అభివృద్ది కోసం మీ అందరూ మద్దతుగా నిలవాలి
-ఇంటింటికి త్రాగునీరు అందించే విధంగా చర్యలు…
-2 కోట్ల 15 లక్షల రూపాయలతో నాలుగు ఓవర్ హెడ్ ట్యాంకుల ప్రారంభోత్సవం…
-48.60 లక్షల రూపాయలతో శ్రీకృష్ణపట్నం గ్రామంలో రైతు భరోసా కేంద్రం, వైయస్సార్ హెల్త్ క్లినిక్, అంబేద్కర్ పార్క్ ప్రారంభోత్సవం..
-17.92 లక్షల రూపాయలతో చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం…
-పలు గ్రామాలలో చేపట్టిన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న జక్కంపూడి రాజా…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తున్నట్లు రాజానగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా పేర్కొన్నారు. బుధవారం రాజానగరం మండలం పాత తుంగపాడు, రాధేయపాలెం, శ్రీకృష్ణపట్నం గ్రామంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమంలో ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పాల్గొన్నారు..

ఈ సందర్భంగా ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏ గ్రామానికి అయినా వెళ్లిన అభివృద్ధి కళ్ళకు కట్టినట్లు కనపడుతుందని, జరిగిన అభివృద్ధి, సంక్షేమంతో గ్రామంలోని ప్రజలంతా ఆనందంగా ఉంటున్నారన్నారు. గ్రామాలలో ప్రతి ఒక్కరికి మౌలిక వసతులు కల్పించాలన్న ఆలోచనతోనే ఈ ప్రభుత్వం పని చేస్తొందని అందులో భాగంగానే గ్రామాలలో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా గ్రామ సచివాలయాల నిర్మాణం, రైతు భరోసా కేంద్రాలు, వైయస్సార్ హెల్త్ క్లినిక్లు నిర్మాణం చేపట్టి అందుబాటులోకి తీసుకుని రావడం జరిగిందిన్నారు. మన ప్రభుత్వంలో ఏ గ్రామాన్నీ చూసిన గత ప్రభుత్వంతో పోలిస్తే కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేసామన్నారు. అందులో భాగంగా రోడ్లు,సిసి డ్రైన్లు,నాడు నేడు పథకంలో భాగంగా పాఠశాల ఆధునికరణ పనులు, చెరువుల అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. గతంలో మండల కేంద్రాలకు వెళ్లల్సిన పరిస్థితి, అక్కడ సేవలు అందుబాటు ఉంటాయో, ఉండవో తెలియని గందరగోళ పరిస్థితి ఉండేదన్నారు. కానీ నేడు జగనన్న పాలనలో వాలంటీర్ల ద్వారా అన్ని సేవలు ఇంటి వద్దనే అర్హులకు సంక్షేమ పథకాల ను అందజేస్తున్నా మన్నారు. రాజానగరం మండలంలో జలజీవన్ మిషన్ పథకంలో భాగం గా 32 ఓవర్ హెడ్ ట్యాంకులు శాంక్షన్ అయ్యాయని, వాటి నిర్మాణం చేపట్టి ప్రజలకు అందుబాటులో తేవడం జరిగిందని అన్నారు.

నేడు పాత తుంగపాడు గ్రామంలో 63.4 లక్షల రూపాయలతో చేపట్టిన ఓవర్హెడ్ ట్యాంక్, రాధేయ పాలెం గ్రామంలో 66.6 లక్షల రూపాయలతో నిర్మించిన ఓవర్ హెడ్ ట్యాంకు, శ్రీ కృష్ణ పట్నం గ్రామంలో రెండు ఓవర్ హెడ్ ట్యాంకులను 85.5 లక్షల రూపాయలతో చేపట్టడం జరిగిందని మొత్తం నాలుగు ట్యాంకులను 2 కోట్ల 15 లక్షల రూపాయలతో ప్రారంభించి ప్రజలకు అందుబాటులో తేవడం జరిగిందన్నారు. శ్రీకృష్ణపట్నం గ్రామంలో 21.80 లక్షల రూపాయలతో వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రం 20.80 లక్షల రూపాయలతో వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్, ఆరు లక్షల రూపాయలతో అంబేద్కర్ పార్కును నేడు ప్రారంభించామని 17.92 లక్షల రూపాయల తో చెరువు అభివృద్ధి పనులు శ్రీకారం చుట్టామన్నారు. మన ప్రభుత్వము అధికారం చేపట్టిన నాటి నుండి నేటి వరకు మన నియోజకవర్గంలో 1158 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు 1142 కోట్ల రూపాయలతో వివిధ సంక్షేమ పథకాల రూపంలో ప్రజలకు అందించడం జరిగిందన్నారు. రాజానగరం నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తున్నా మని రానున్న సార్వత్రిక ఎన్నికలలో ప్రతి ఒక్కరు మద్దతు తెలపాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *