-నైపుణ్యం కల్పించి – ఉద్యోగ భద్రత కల్పించండి
-కనీసం ఆరు నెలలు వారి పనితనం చూడాలి
-ప్రాంతీయ ‘మెగా జాబ్’ మేళాలో ఎంపీ భరత్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జాబ్ మేళా అనగానే నిరుద్యోగు లకు వరం కావాలే కానీ, వారి ఆశలపై నీళ్ళు చల్లేలా ఉండకూడదని రాజమండ్రి ఎంపీ, మార్గాని భరత్ రామ్ అన్నారు. బుధవారం నగరంలోని వీఎల్ పురం, మార్గాని ఎస్టేట్స్ లో ప్రాంతీయ ‘మెగా జాబ్ మేళా’ను ఎంపీ భరత్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రారంభోత్సవ సభకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. జాబ్ మేళా ఒక ప్రహసనంగా కాకుండా, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేదిగా, వారి జీవితానికి ఒక భరోసా కల్పించేదిగా ఉండాలన్నారు. జాబ్ మేళా నిర్వహించడం.
.అభ్యర్థులను ఎంపిక చేసుకుని వారి పెర్ఫార్మెన్స్ బాగుండలేదనే అసంతృప్తితో ఒకటీ రెండు నెలలకే తొలగించడం కాకుండా , నైపుణ్యం కల్పించి స్తిరపడెలా బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు. ఎంపిక చేసుకునే ముందే అభ్యర్థులకు కంపెనీ నిబంధనలు తెలియజేయడంతో పాటు, వారికి లాకింగ్ పీరియడ్ ఆరు నెలలు ఉండాలని సూచించారు. తగు శిక్షణ ఇచ్చి, ఉద్యోగ భద్రత కల్పిస్తే.. జాబ్ మేళా నిర్వహణకు ఒక సార్థకత ఏర్పడుతుందని ఎంపీ భరత్ అభిప్రాయపడ్డారు. ఈ జాబ్ మేళాకు ఒక్క తూర్పు గోదావరి జిల్లా నుంచే కాకుండా కాకినాడ, కోనసీమ, ఏలూరు తదితర జిల్లాల నుండి విశేష సంఖ్యలో నిరుద్యోగ యువతీ యువకులు హాజరయ్యారు. కార్యక్రమంలో రుడా ఛైర్మన్ రౌతు సూర్య ప్రకాశరావు, స్థానిక నాయకులు డాక్టర్ గూడూరి శ్రీనివాస్, అడపా శ్రీహరి, డీఆర్డీఏ పీడీ ఎన్వీవీఎస్ మూర్తి, ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ కే హరిశ్చంద్ర ప్రసాద్, డీఐసీ జీఎం బీ వెంకటేశ్వరరావు, ఏపీఎస్ఎస్డీసీ ఈడీ కే దినేష్ కుమార్, జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి ఎమ్ . కొండల రావు, ప్లేస్మెంట్ మేనేజర్ కిరణ్ బొబ్బిలి, తూర్పు, పశ్చిమ, కాకినాడ, కోనసీమ, ఏలూరు, జేడీఎం జిల్లాల స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ ఎం కొండలరావు, ఏ కృష్ణారెడ్డి, డీ హరిశేషు, పీ లక్ష్మణరావు, జీ సుధాకర్, పీ కిరణ్ కుమార్, స్ధానిక ప్రజా ప్రతినిధి రావిపాటి రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News