Breaking News

ద్వారకా తిరుమల క్షేత్రంలో రూ. 16.70 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన మంత్రులు కొట్టు సత్యన్నారాయణ, తానేటి వనిత

ద్వారకాతిరుమల, నేటి పత్రిక ప్రజావార్త :
శ్రీవారి శోభను మరింత పెంచేలా క్షేత్రంలో అభివృద్ధి పనులు చేస్తున్నట్లు డిప్యుటీ సీఎం, రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యన్నారాయణ వెల్లడించారు. కొండపైన రూ.16.70 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలను బుధవారం నిర్వహించారు. అందులో ముఖ్య అతిధులుగా పాల్గొన్న మంత్రి కొట్టు, రాష్ట్ర హోం శాఖ మంత్రి తానేటి వనితలు దర్మ అప్పారాయ నిలయంపై రూ. 10 కోట్ల వ్యయంతో రెండవ అంతస్తులో సూట్ రూముల నిర్మాణానికి, అలాగే పార్కింగ్ ప్రాంతంలో రూ. 6.30 కోట్ల వ్యయంతో రిటైనింగ్ వాల్ నిర్మాణానికి వారు శంకుస్థాపనలు చేశారు. అదేవిధంగా స్వామివారి నిత్య కల్యాణ మండపం పక్కన ఒక దాత రూ. 40 లక్షలతో నిర్మించిన సహస్ర దీపాలంకరణ సేవ మండపాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత ఆలయ ఈఓ వేండ్ర త్రినాధరావు, ఈఈ డీవీ భాస్కర్లు అభివృద్ధి పనులకు సంబంధించిన ప్లాన్లను చూపించి, మంత్రులకు వాటిని వివరించారు. దర్శనానంతరం మంత్రి కొట్టు, హోం శాఖ మంత్రి వనితతో కలిసి మీడియాతో మాట్లాడారు. ద్వారకాతిరుమల క్షేత్రంలో గతంలో క్యూ కాంప్లెక్స్, అనివేటి మండపం, పార్కింగ్ ప్రాంత విస్తరణ పనులకు శంకుస్థాపనలు, అలాగే పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలను నిర్వహించామన్నారు. తాజాగా ధర్మ అప్పారాయ నిలయంపై రెండవ అంతస్తులో సూట్ రూముల నిర్మాణానికి శంకుస్థాపన చేశామని, కాటేజీలు తీసుకోలేని వారికి, సాధారణ గదులకన్నా మెరుగైనవి. కావాలనుకునే భక్తులకు ఇవి అందుబాటులో ఉంటాయన్నారు. ఈ సూట్ రూముల నిర్మాణానికి దాతలు ముందుకొస్తున్నారని తెలిపారు. పార్కింగ్ ప్రాంతంలో రిటైనింగ్ వాల్ నిర్మించడం వల్ల వర్షాలకు కొండ ప్రాంతం కుంగిపోకుండా ఉంటుందన్నారు. సహస్ర దీపాలంకరణ సేవ మండప నిర్మాణం పూర్తవడంతో త్వరలో స్వామివారికి ఈ సేవ ప్రారంభం అవుతుందన్నారు. మాస్టర్ ప్లాన్కు అనుగుణంగా తిరుమల తిరుపతి తరహాలో ఇక్కడ ఆలయం చుట్టూ మాడవీదులు నిర్మించనున్నట్టు ఆయన తెలిపారు. ఆ మాడవీదుల్లో ఎటువెళ్లినా భక్తులకు ప్రసాదాలు అండేలా కౌంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. త్వరలో అగ్రిమెంట్ల ప్రక్రియను పూర్తవుతుందని, ఆ తర్వాత మాడవీదుల నిర్మాణానికి టెండర్ ప్రక్రియ మొదలవుతుందన్నారు. అనంతరం మంత్రి వనిత మాట్లాడుతూ ప్రజలకు సంక్షేమ ఫలాలు పుష్కలంగా అంది. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, అందుకు జగనన్నను మరోసారి ముఖ్యమంత్రి అయ్యేలా ఆశీర్వదించాలని ఆ స్వామివారిని కోరుకున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ చెలికాని రాజబాబు, జెడ్పీటీసీ చిగురుపల్లి శామ్యూల్, ఆలయ అనువంశిక ధర్మకర్త ఎస్వీ నివృతరావు, ట్రస్టుబోర్డు సభ్యులు పెద్దిరెడ్డి పద్మజ్యోతి, మానుకొండ సుబ్బారావు, ఆచంట అనసూయ తానంకి గంగరాజు, వాసే రామకృష్ణ నూకల అమ్మాజీ, పాలా వెంకటేశ్వరరావు, తొమ్మండ్రు రమేష్, కొట్టు వెంకటేశ్వరరావు, తాడేపల్లిగూడెం ఏఎంసీ చైర్మన్ ముప్పిడి సంపత్ కుమార్, నాయకులు యిమ్మడి నాగు, పెద్దిరెడ్డి జ్యోతి శ్రీనివాస్, ఉక్కుర్తి వెంకట్రావు, అచ్యుత ఏసుబాబు, పెద్దిరెడ్డి నాగేశ్వరరావు, రుద్ర శివాజీ, పొనమాల ఉమామహేశ్వరరావు, ఆచంట సురేష్, మానుకొండ కన్నయ్య, బాలం వెంకటేశ్వరరావు, గుర్రాల లక్ష్మణ్, సర్పంచ్లు కుంటం స్వర్ణలత, పసుపులేటి ఏసుబాబు, పెండ్యాల విజయ్. వసంతాటి సుబ్బారావు. భోగరాజు సాయికృష్ణ, అల్లాడ హరేరామకృష్ణ, రవి యాదవ్ తదితరులున్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పాఠశాల బస్సు డ్రైవర్లు నిబద్ధతతో విధులు నిర్వహించాలి

-విద్యార్థుల భద్రత డ్రైవర్లపై ఉన్న అత్యంత కీలక బాధ్యత -డ్రైవర్లు విధిగా యూనిఫామ్ ధరించాలి -డ్రైవింగ్ నైపుణ్యంతో పాటు మంచి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *