Breaking News

మార్చి 6న రాష్ట్ర స్థాయి ఈఎండీపీ ఎక్స్ పో

-పాఠశాల విద్యాశాఖ కమీషనర్ ఎస్.సురేష్ కుమార్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్థిరమైన భవిష్యత్తు కోసం యువ విద్యార్థులు ప్రావీణ్యం పొందేందుకు వ్యవస్థాపక విద్య డిమాండ్తో కూడిన అంశంగా ఉద్భవించింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వ్యవస్థాపక విద్యను ప్రస్తుత అవసరంగా గుర్తించి పాఠ్యాంశాల్లో భాగంగా ప్రవేశపెట్టింది. ఈ కార్యక్రమం జూలై 20, 2021న ప్రారంభమై గత మూడు సంవత్సరాలుగా దిగ్విజయంగా కొనసాగుతోంది. ఈ సంవత్సరం వ్యవస్థాపక మనస్తత్వ అభివృద్ధి కార్యక్రమం (Entrepreneurial Mindset Development Program) రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో 9వ తరగతి చదువుతున్న సుమారు 3 లక్షల మందికి పైగా విద్యార్థులతో దాదాపు 5000 పాఠశాలల్లో అమలు చేయబడింది. పాఠశాల దశలోనే విద్యార్థుల్లో దాగిఉన్న విజ్ఞానం, ఆత్మవిశ్వాసం, భావవ్యక్తీకరణ, సహకారం, సృజనాత్మకత, సమస్య పరిష్కార సామర్ధ్యం తదితర నైపుణ్యాల ద్వారా సమాజంలోని సమస్యలను గుర్తించి వాటికి పరిష్కార మార్గాలను అన్వేషించడంతో పాటు దైనందిన జీవితానికి అన్వయించడం జరుగుతుంది. ఈ అభ్యాసనలో భాగంగా విద్యార్థులు ప్రోజెక్టుల ద్వారా ఈ కార్యక్రమం నుండి వారు నేర్చుకున్న విషయాలను ప్రదర్శిస్తారు. ఈ పోటీలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మరియు లాభాపేక్షలేని సంస్థలు ఉద్యమ్ లెర్నింగ్ ఫౌండేషన్ , అఫ్లటూన్ ఇంటర్నేషనల్, రీప్ బెనిఫిట్ సంయుక్తంగా మరియు అమెజాన్ సహకారంతో నిర్వహిస్తున్నారు.

ఇందులో భాగంగా ఫిబ్రవరి 23 నుండి మార్చి 3వ తేదీ వరకు జిల్లా స్థాయి మరియు మార్చి 6వ తేదీన రాష్ట్ర స్థాయి ఎక్స్ పోలను నిర్వహించనున్నారు. ఇప్పటివరకు విశాఖపట్నం, తిరుపతి, కర్నూలు, చిత్తూరు, నంద్యాల, కృష్ణా జిల్లాల్లో ఎక్స్ పోలను జిల్లా విద్యాశాఖాధికారి, జిల్లా సైన్స్ అధికారి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ జిల్లాల నుండి 2429 ప్రాజెక్టులు రాగా, అందులో 93 ప్రాజెక్టులు జిల్లా స్థాయిలో ప్రదర్శించబడ్డాయి. వాటిలో 16 ప్రాజెక్టులు రాష్ట్ర స్థాయి ఎక్స్ పోకు జిల్లా విద్యాశాఖాధికారి మరియు జిల్లా సైన్స్ అధికారి ఆధ్వర్యంలోని కమిటీ ఎంపిక చేసారు.

ఇప్పటివరకు పోటీలు పూర్తయిన జిల్లాల విజేతలు

1. విశాఖపట్నంనుండి జ్ఞాననికేతన్ ఎయిడెడ్ స్కూల్ కు ప్రథమ స్థానం, జీహెచ్ఎస్ రైల్వే కాలనీ స్కూలుకు ద్వితీయ స్థానం
2. తిరుపతి నుండి జెడ్పిహెచ్ఎస్ తడ కు ప్రథమ స్థానం , జెడ్పిహెచ్ఎస్ ఆర్ జి కాలనీ కి ద్వితీయ స్థానం.
3. కర్నూలు నుండి జెడ్పిహెచ్ఎస్ చెరుకులపాడు కు ప్రథమ స్థానం, డా. ఏపీజే ఆబ్దుల్ కలం మున్సిపల్ హై స్కూల్ కు ద్వితీయ స్థానం.
4. చిత్తూరు నుండి జడ్పీహెచ్ఎస్ పదిరికుప్పంకు ప్రథమ స్థానం, జడ్పీహెచ్ఎస్ జి. డి. నెల్లూరు కు ద్వితీయ స్థానం
5. నంద్యాల నుండి జడ్పీహెచ్ఎస్ నందీవర్గంకు ప్రథమ స్థానం, కెజిబివి సిర్వెల్ కు ద్వితీయ స్థానం
6. కృష్ణ నుండి ఎస్.ఎమ్.కె జడ్పీహెచ్ఎస్ మొవ్వ కు ప్రథమ స్థానం, ఎస్. ఎల్. ఎస్. వి. వి. ఎస్ ఓ. హెచ్. ఎస్ పెదముత్తేవి కు ద్వితీయ స్థానం
7. పల్నాడు నుండి డా.బి.ఆర్.అంబేద్కర్ గురుకులంకు ప్రథమ స్థానం, జడ్పీహెచ్ఎస్ తూబాడు కు ద్వితీయ స్థానం
8. శ్రీ సత్య సాయి నుండి జడ్పీహెచ్ఎస్ ధనపురంకు ప్రథమ స్థానం, ప్రభుత్వ ఉన్నత పాఠశాల తలుపుల కు ద్వితీయ స్థానం పొందారు. ఈ ప్రాజెక్టులన్నీ మార్చి 6వ తేదీన రాష్ట్ర స్థాయి లో జరిగే ఎక్స్ పోలో ప్రదర్శించబడతాయి.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విజయవాడ ఆయుర్వేద కళాశాలలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవ వేడుకలు

-ధన్వంతరి హోమం నిర్వహణ -సిసిఆర్ఎసి – స్పార్క్ స్కాలర్‌షిప్ చెక్కుల పంపిణీ -ప్రతిభావంతులైన విద్యార్థులకు అవార్డులు విజయవాడ, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *