గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
మున్సిపాలిటీలలో ఇంధన పొదుపు అవసరం తప్పనిసరి అని నగరపాలక సంస్థ ఎస్.ఈ.(ఎఫ్.ఏ.సి.) సుందర్రామిరెడ్డి తెలిపారు. ఏపి స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ (ఏపిఎస్ఈసిఎం) ఆధ్వర్యంలో బుధవారం నగరపాలక సంస్థ కాన్ఫరెన్స్ హాల్లో జిఎంసి పంప్ ఆపరేటర్లకు ఇందన పొదుపుపై శిక్షణా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎస్.ఈ మాట్లాడుతూ స్థానిక సంస్థల్లో త్రాగునీటి సరఫరా విభాగంలోని పంప్ ఆపరేటర్లు ఇందన పొదుపు అంశంలో కీలకంగా ఉంటారన్నారు. స్థానిక సంస్థల ఆదాయంలో ఎక్కువ భాగం విద్యుత్ బిల్లుల చెల్లింపుకే వినియోగిస్తున్నందున ఇతర అభివృద్ధి పనులకు నిధులు అందుబాటులో ఉండడం లేదని, ఇంధనాన్ని ఆదా చేయడమే కాకుండా పర్యావరణ పరిరక్షణ కోసం కూడా ఇంధన సంరక్షణ కార్యకలాపాలను అమలు చేయాలన్నారు. అనంతరం పంప్ ఆపరేటర్లకు టూల్ కిట్లు, పార్టిసిపేషన్ సర్టిఫికెట్స్ అందించారు. శిక్షణలో సిఆర్డిఏ సిఈ శివ ప్రసాదరాజు, ఈఈ శ్రీనివాస్, డాక్టర్ సుబ్రహ్మణ్యం, జి.శ్రీనివాసులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News