ఆహ్లాదాన్ని పంచే, ఆనందాన్ని పెంచే రిటైనింగ్ వాల్ పార్క్ నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయండి

-నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, అధికారుల ఆదేశాలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ బుధవారం ఉదయం తన పర్యటనలో భాగంగా కృష్ణానది ఫేస్ 2 రిటైనింగ్ వాల్ వెంబడి అత్యంత సుందరంగా ఆహ్లాదకరమైన పార్కు ఏర్పాటుకు కనకదుర్గ వారిధి నుంచి పోలీస్ కాలనీ డిపి స్టేషన్ వరకు నిర్మాణం అవుతున్న రిటైనింగ్ వాల్ పార్క్ ను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జరుగుతున్న నిర్మణ పనులను పరిశీలించి వేస్తున్న పేపర్ బ్లాక్ ను నాణ్యత ప్రమాణాలలో రాజీ పడకుండా అవసరమైతే బ్యాచులను పెంచి పనులను త్వరతిగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. పాత్వే ను పరిశీలించి, మలుపులు అత్యంత సుందరంగా ఉండాలని అన్నారు. కనులకు విందుల అనిపించేలా మొక్కల్ని పెట్టి గ్రీనరీ వర్క్ వెంటనే మొదలు పెట్టాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ పర్యటనలో కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తోపాటు అడిషనల్ కమిషనర్ జనరల్ ఎ.మహేష్, చీఫ్ ఇంజనీర్ ఏం ప్రభాకర్ రావు, డిప్యూటీ ఇంజనీర్ పార్క్స్ పురుషోత్తం, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *