Breaking News

ట్రైకార్‌ ఛైర్మన్‌గా గుండా సురేంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్‌ షెడ్యూల్డ్‌ తెగల కో`ఆపరేటివ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (ట్రైకార్‌) సంస్థ ఛైర్మన్‌గా గుండా సురేంద్ర బాధ్యతలు స్వీకరించారు. బుధవారం గిరిజన సంక్షేమశాఖ కమిషనర్‌ వారి కార్యాలయం నందు ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో గుండా సురేంద్ర పాత్రికేయులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అతి సామాన్య కుటుంబంలో పుట్టిన నన్ను గుర్తించి ఆంధ్రప్రదేశ్‌ షెడ్యూల్‌ తెగల కోపరేటివ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా చేశారని ఈ అవకాశాన్ని కల్పించిన ఆయనకు నేను, నాజాతి యావత్తు ఎంతో రుణపడి వుంటామన్నారు. గిరిజనుల జీవితాలలో వెలుగులు నింపడానికి అభివృద్ధే ప్రధాన ధ్యేయంగా పనిచేస్తానని అన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో నవరత్నాల పథకాలు ద్వారా గిరిజనుల జీవితాలలో వెలుగులు నింవుతున్నారని, రాష్ట్రంలో గిరిజనులు 34 తెగలకు సంబంధించి 40 లక్షలకు పైగా ఉన్నారని వారి ఆర్థిక స్థితిగతులు జీవన ప్రమాణాలు నిరుద్యోగం పైన అన్ని ప్రాంతాలు పర్యటించి ప్రస్తుతం ఉన్నటువంటి సమస్యల పైన ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందించి దానికి పరిష్కార మార్గంగా 100% కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి తనపై విశ్వాసం వుంచి ఈ బాధ్యాయుత పదవినిచ్చినందుకు ఈ పదవికి న్యాయం చేస్తానని, ఆయనకు నేను రుణపడి ఉంటానని అన్నారు. నాతోపాటు 5 డైరెక్టర్లును నియమించారని తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో గిరిజన సంక్షేమం ఏమి జరగలేదని జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో గిరిజనులకు సంక్షేమం పేరుతో ఆర్థికంగా రాజకీయంగా ఎంతో సహాయం చేశారని, రానున్న ఎలక్షన్స్‌లో తప్పక మళ్ళీ జగన్‌మోహన్‌రెడ్డినే గెలిపించికుంటామని వారు అన్నారు. ట్రైకార్‌ ఛైర్మన్‌ గుండా సురేంద్రకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఓడిత్యా నాయక్‌, ఇట్టా బాబూరావు, సంస్థ సిబ్బంది, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

దుర్గమ్మను దర్శించుకున్న ఎమ్మెల్యే సుజనా చౌదరి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇంద్రకీలాద్రి పై కొలువైన అమ్మవారిని మాజీ కేంద్ర మంత్రి, విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *