Breaking News

ఓటును వజ్రాయుధంగా వినియోగించాలి

– సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంయుక్త కార్యదర్శి వల్లం రెడ్డి లక్ష్మణరెడ్డి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ లో ఓటర్లందరూ తమ ఓటు హక్కును ప్రలోభాలకు లోను కాకుండా వినియోగించి ఓటును వజ్రాయుధంగా వినియోగించాలని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంయుక్త కార్యదర్శి వల్ల0 రెడ్డి లక్ష్మణ రెడ్డి పేర్కొన్నారు. ఈనెల 29వ తేదీ న భీమవరంలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాల్లో ఓటు వేద్దాం ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేద్దాం అనే అంశంపై జరిగిన కళాజాతను ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. భారతదేశంలో అత్యధిక ఎన్నికల వ్యయం జరుగుతున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. నేడు చట్టసభలలో క్రిమినల్స్, ధనార్జనపరులు ఎక్కువ అవుతున్నారని తద్వారా ప్రజాస్వామ్యం విలువలు పతనం అవుతున్నాయని వివరించారు. కళాజాత ద్వారా ఆటపాట మాటలతో ఓటర్లను చైతన్యపరిచే కార్యక్రమా లు చేపట్టామని తెలిపారు. శ్రీ విజ్ఞాన వేదిక వ్యవస్థాపకులు చెరుకువాడ రంగ సాయి ప్రసంగిస్తూ ప్రజలను చైతన్య పరచడంలో కళారూపాలు ప్రధాన పాత్ర పోషిస్తున్నయన్నరు. ప్రతి ఒక్కరూ ఓటింగ్ లో పాల్గొని నిజాయితీపరులను ఎన్నుకోవాలని కోరారు. మాజీ సర్పంచ్ తాడినాడ బాబు ప్రసంగిస్తూ ఓటర్లను చైతన్యపరిచే కళా ప్రదర్శనలు అద్భుతంగా ఉన్నాయని ఆలోచింప చేసేవిగా ఉన్నాయని అన్నారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐ ఆర్ ఎస్, పదవులను అధిరోహించిన అనేకమంది అత్యున్నత అధికారులు మేధావులు తో కూడిన సిటిజన్స్ ఫర్ డెమొక్రసీ ఓటర్ల జాబితాలోని లోపాలను సరి చేయడానికి కృషి చేస్తుందన్నారు. కులము, మతము, డబ్బులు, మద్యం లాంటి ప్రలోభాలకు లోను కాకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలిపారు. ఎన్ ఎస్ ఎస్ కోఆర్డినేటర్చేల్లబోయిన రంగారావు ప్రసంగిస్తూ యువత ఓటు హక్కు ఉన్న విద్యార్థులు ఓటింగ్ లో పాల్గొని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. రంగం ప్రజా సాంస్కృతిక వేదిక వ్యవస్థాపకులు ఆర్ రాజేష్ నేతృత్వంలో 11 మంది కళాకారులు నిర్వహించిన కళా ప్రదర్శనలు సబికులను ఆలోచింపచేసాయి. ఈ కార్యక్రమంలో దండు శ్రీనివాసరాజు వైవి ఆనంద్ చాన్ బాషా తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *