Breaking News

విజయవాడలో ‘రాన్‌’ అవుట్‌లెట్‌ ప్రారంభం

-సినీ నటి నేహా శెట్టి సందడి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో ప్యాషన్‌ ప్రియుల మనస్సు దోచే ‘రాన్‌’ అవుట్‌లెట్‌ ప్రారంభమైంది. బెంజ్‌సర్కిల్‌ సమీపంలోని వీఎస్‌ఎన్‌ మాల్‌లో డీజే టిల్లు ఫేమ్‌, సినీ నటి నేహా శెట్టి గురువారం ప్రారంభించారు. రాన్‌ యూఎస్‌పిఎల్‌ (యూనివర్సల్‌ స్పోర్ట్‌ బిజ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌) యాజమాన్యంలో ఉంది. ఇది భారతదేశంలో ప్యాషన్‌ మార్గదర్శకులైన అంజనారెడ్డిచే స్థాపించబడిరది. రాన్‌ తన మొదటి ప్రత్యేక అవుట్‌లెట్‌ను 2016లో హైదరాబాద్‌లో ప్రారంభించింది. ఈ సందర్భంగా నేహా శెట్టి మాట్లాడుతూ ఈ అవుట్‌లెట్‌ ప్రారంభోత్సవానికి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్యాషన్‌ అంటే ఇష్టపడే వారికి ఇది సరైన ఎంపిక అవుతుందన్నారు. అనంతరం యూఎస్‌పీఎల్‌ సహ వ్యవస్థాపకుడు, సీవోవో విక్రమ్‌రెడ్డి మాట్లాడుతూ రాన్‌ దేశంలో 75 ప్రత్యేకమైన బ్రాండ్‌ అవుట్‌ లెట్లను కలిగి ఉందన్నాడు. ఈ స్టోర్‌లో అధునాతన టీ-షర్టులు, షర్టులు, జీన్స్‌, స్లిమ్‌-ఫిట్‌ ప్యాంటులు, కార్గోలు, క్యాజువల్‌ జాకెట్లు, క్యాజువల్‌, సెమీ ఫార్మల్‌ గల 250 పైగా డిజైన్లు ఉన్నాయన్నారు. వీటి ధర రూ.999 నుంచి ప్రారంభమవుతాయని తెలిపారు. రాన్‌ పురుషుల దుస్తుల కలెక్షన్‌ విరాట్‌ కోహ్లి లేబుల్‌ డిజైన్‌ బృందంతో కలిసి రూపొందించారని చెప్పారు. దేశంలోని ప్రధాన నగరాల్లో విస్తరణపై దృష్టి సారించామన్నారు. ఈ విస్తరణ ఉనికి కోసం కాదని, ఫ్యాషన్‌ ప్రియులతో ఉన్న బంధాన్ని మరింత పెంచుకోవడానికి అన్నారు. నాణ్యత గల దుస్తులను అందించడమే కాకుండా కస్టమర్లతో కనెక్ట్‌ అయ్యే ప్రత్యేక బ్రాండ్‌ అనుభవాన్ని అందించడం కూడా అన్నారు. విజయవాడలోని కొత్త స్టోర్‌ యువతను ఆకట్టుకోనుందన్నారు. రాన్‌ భారతదేశంలో ప్రముఖ బ్రాండ్‌ తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకోవడానికి సిద్ధంగా ఉందన్నారు. నేహా శెట్టిని చూసేందుకు అభిమానులు, జనం ఎగబడ్డారు. ‘రాన్‌’ షోరూమ్‌ ప్రారంభించిన తరువాత అందరికి అభివాదం చేశారు. హాయ్‌ విజయవాడ అంటూ హుషారెత్తించారు. అభిమానులతో సెల్ఫీలు దిగారు. ఈ కార్యక్రమంలో సంస్థ సిబ్బంది, కొనుగోలుదారులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిన్నతనంలోనే కండరాల క్షీణత గుర్తింపుపై ప్రత్యేక దృష్టి: మంత్రి కందుల దుర్గేష్

-అమరావతి రేర్ డిసీజెస్ ఆర్గనైజేషన్ ఫౌండర్ శోభారాణి సుంకర సేవలు అభినందనీయమని కొనియాడిన మంత్రి దుర్గేష్ అమరావతి, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *