-నిరంతరం పటిష్టమైన నిఘా ఉండాలి..
-కలెక్టర్ ఎస్. ఢిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాకు సంబంధించి ఈవీఎంలను భద్రపరిచిన గోడౌన్ వద్ద నిరంతరం పటిష్టమైన నిఘా ఉండాలని జిల్లా కలెక్టర్ ఎస్.ఢిల్లీరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు త్రైమాసిక తనిఖీల్లో భాగంగా గొల్లపూడి మార్కెట్ యార్డ్ లో ఉన్న ఈవీఎం గోడౌన్ ను గురువారం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ ల ప్రతినిధులతో కలిసి జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రాజకీయ పార్టీల సమక్షంలో గోదాము లోపల భద్రపరిచిన ఆయా ఈవీఎం యంత్రాలు బియులు, సియూలు, వివి ప్యాట్ లను, అక్కడి భద్రతా చర్యలను జిల్లా కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఈవీఎం యంత్రాలకు కల్పించిన భద్రత పట్ల జిల్లా కలెక్టర్ తో పాటు రాజకీయ పార్టీల ప్రతినిధులు సంతృప్తిని వ్యక్తం చేశారు. పరిశీలనలో డిఆర్‌వో వి. శ్రీనివాసరావు, ఈవీఎం నోడల్ ఆఫీసర్ ఉమామహేశ్వరరావు, కలెక్టరేట్ ఎన్నికల విభాగం సూపరిండెంట్ ఎం దుర్గ ప్రసాద్, పార్టీ ప్రతినిధులు ఆంజనేయ రెడ్డి (వై ఎస్ ఆర్ కాంగ్రెస్), రామయ్య(టిడిపి), వినోద్ కుమార్ (బిఎస్ పి) పీవీ శ్రీహరి (బిజెపి) పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News