మార్చి ఒకటవ తేదీ ఉదయం నుండే కార్డుదారులకు నిత్యావసర సరుకుల పంపిణీ

-జాయింట్ కలెక్టర్ డా. పి. సంపత్ కుమార్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా కార్డుదారులకు సరఫరా చేసే నిత్యావసర సరుకుల పంపిణీని మార్చి ఒకటో తేదీ శుక్రవారం ఉదయం 7 గంటల నుండి ప్రారంభించడం జరుగుతుందని జాయింట్ కలెక్టర్ డా. పి. సంపత్ కుమార్ తెలిపారు. మొబైల్ డిస్పర్సింగ్ యూనిట్ ( ఎండియు) ఆపరేటర్లు శుక్రవారం నుండి ప్రతిరోజు ఉదయం 7 గంటలకు నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం రేషన్ బియ్యం,పంచదార,గోధుమపిండి నిర్ణిత ధరలతో మార్చి ఒకటో తేదీ శుక్రవారం నుండి కార్డుదారుల ఇంటి వద్దనే పంపిణీ చేసేలా ఆదేశించామన్నారు. విటమిన్ ఏ, పోలిక్ యాసిడ్, విటమిన్ బి12, ఐరన్ కలిపిన పోషక విలువలతో కూడిన బియ్యాన్ని పంపిణీ చేయుచున్నందున కార్డుదారులు ఆ బియ్యాన్ని వినియోగించుకొని సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లాలోని కార్డుదారులు ప్రభుత్వం సరఫరా చేసే పోషక విలువల పోర్టి ఫైడ్ బియ్యం, పంచదార, గోధుమ పిండిలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లాలోని కార్డుదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. వచ్చే నెల నుండి పూర్తి కోటా కందిపప్పు సరఫరా చేసేల చర్యలు తీసుకుంటున్నామన్నారు. చౌక ధరదుకాణాల డీలర్లు ఎండియు ఆపరేటర్ల ద్వారా శుక్రవారం ఉదయం నుండి సరుకుల పంపిణీ ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సరఫరా చేసే బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు అమ్మకాలు నిర్వహించే వారిపై కఠినంగా వ్యవహరించడంతో పాటు క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుందని జాయింట్ కలెక్టర్ సంపత్ కుమార్ హెచ్చరించారు. నిత్యావసర సరుకుల పంపిణీలో ఫిర్యాదులు ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ 1967 కు ఫోన్ చేయవచ్చునని జాయింట్ కలెక్టర్ డా. పి. సంపత్ కుమార్ తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *