విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC) మరియు జిల్లా ఉపాధి కల్పన శాఖ సంయుక్త ఆధ్వర్యంలో, జిల్లాలోని నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించుటకు గాను ది.29.02.2024 గురువారం నాడు, పోరంకి లోని HappyMinds ట్రైనింగ్ సెంటర్ నందు “మినీ జాబ్ మేళా” నిర్వహించినట్లు డి.విక్టర్ బాబు, జిల్లా ఉపాధి కల్పన అధికారి మరియు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి యస్. శ్రీనివాసరావు సంయుక్తంగా తెలియజేసారు.
ఉమ్మడి జిల్లాల ఉపాధి కల్పన శాఖ అధికారి డి.విక్టర్ బాబు మాట్లాడుతూ, అధిక సంఖ్యలో నిరుద్యోగ యువతీ, యువకులకు ఉద్యోగాలను కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వ అధ్వర్యంలో ఈ జాబ్ మేళాను నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఈ మినీ జాబ్ మేళాలో, ముత్తూట్ ఫైనాన్స్ లిమిటెడ్ మరియు HDB ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలలో గల వివిధ ఉద్యోగాలకు సంబందించి ఇంటర్వ్యూలు నిర్వహించినట్లు తెలిపారు. మొత్తం 31 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరు కాగా, వారికి ఇంటర్వ్యూలు నిర్వహించగా 12 మంది ఎంపికయ్యారని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి యస్. శ్రీనివాసరావు తెలిపారు.
ఈ కార్యక్రమంలో, డి.విక్టర్ బాబు గారు, జిల్లా ఉపాధి కల్పన అధికారి, APSSDC సంస్థ జిల్లా నియామక అధికారి తుర్లపాటి మధు, స్కిల్ కాలేజ్ కో-ఆర్డినేటర్ ఎమ్.శంకర్ మరియు కంపెనీ HR ప్రతినిధులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News