యమ్ యస్ యమ్ ఈ లను సర్వే…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని యమ్ యస్ యమ్ ఈ సర్వే అండ్ సపోర్ట్ (MSME Survey & Support) మొబైల్ యాప్ లో నమోదు చేసేల చర్యలు తీసుకోవాలని ఎంపీడీవోలు, మున్సిపల్ కమీషనర్లను జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు ఆదేశించారు.

కలెక్టరేట్ నుండి గురువారం జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, పరిశ్రమల శాఖ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులతో కలెక్టర్ ఢిల్లీరావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ యమ్ యస్ యమ్ ఈ ల ఫార్మలైజేషన్ లో భాగంగా రాష్ట్రంలోని అన్ని యమ్ యస్ యమ్ ఈ లను సర్వే చేయడం కోసం ప్రభుత్వం పరిశ్రమల శాఖ ద్వారా జీవో ఎంఎస్ నెంబర్ 24 ద్వారా ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. తద్వారా యమ్ యస్ యమ్ ఈల పని తీరును మెరుగుపరచి అభివృద్ధిని వేగవంతం చేసి ప్రభుత్వం నుండి అందే ప్రోత్సహకాలు, రాయితీలు, విధివిధానాలు తెలుసుకొనేందుకు అవకాశం ఉంటుందన్నారు. సచివాలయాల పరిధిలోని ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, వార్డ్ అమెనిటీ సెక్రటరీలు యమ్ యస్ యమ్ ఈ సర్వే అండ్ సపోర్ట్ యాప్ లో వివరాలను నమోదు చేయవలసి ఉంటుందనన్నారు. జిల్లాలోని అన్ని గ్రామ, మండల, పట్టణ, మున్సిపల్ పరిధిలోని వాణిజ్య, వస్తు, సేవ రంగాలకు చెందిన సంస్థల ట్రేడ్ లైసెన్స్, జీఎస్టీ, ఉద్యోగుల వివరాలు, ఇఎస్ఐ, ఇపిఫ్, బ్యాంకుల నుండి పొందిన రుణ తదితర వివరాలను ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, వార్డ్ అమెనిటీ సెక్రటరీలు రేపటి నుండి క్షేత్రస్థాయిలో నమోదు ప్రారంభించి మార్చి 20వ తేదీ లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సర్వే ద్వారా తయారీ, సేవ మరియు వాణిజ్య రంగాలలోని అన్ని యమ్ యస్ యమ్ ఈ లను సర్వే చేసి వాటిని డిజిటల్ ప్లాట్ ఫామ్ లోనికి తీసుకురావడం ద్వారా ఏపీ యమ్ యస్ యమ్ ఈ వన్ (AP MSME One) పోర్టల్ కు అనుసంధానించాలన్నారు. ఈ సర్వే ద్వారా యమ్ యస్ యమ్ ఈ ల డేటా బేస్ ను అభివృద్ధి చేసందుకు వీలుకలుగుతుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలపై అవగాహన కల్పించడం, మహిళలు మరియు ఎస్టీ, ఎస్సీ పారిశ్రామికవేత్తల నైపుణ్యాలను అభివృద్ధిపరచటం తదితర సేవలను యమ్ యస్ యమ్ ఈలకు అందించి వివిధ రకాల ప్రభుత్వ ప్రోత్సాహకాలను పొందేందుకు బ్యాంకుల ద్వారా రుణ సదుపాయాలు సులభతరం అవుతాయన్నారు. ఈ సర్వేకు యమ్ యస్ యమ్ ఈ అసోసియేషన్లు, వివిధ పరిశ్రమల ఆసోసియేషన్లు, వర్తక, వాణిజ్య సంఘాలు సర్వేకు అవసరమైన వివరాలు అందించేందుకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించి సర్వేను విజయవంతం చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఢిల్లీరావు ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ లో పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ ఎ. సుధాకర్, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ సీతారాం, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇఇ శ్రీనివాస్, మున్సిపల్ కమీషనర్లు, ఎంపీడీవోలు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *