ముగిసిన జాతీయ సదస్సు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్టెల్లా కళాశాల లోని కంప్యూటర్ సైన్స్ విభాగం మరియు కృష్ణ యూనివర్సిటీ సంయుక్తం గా నిర్వహిస్తున్న మూడు రోజుల జాతీయ సదస్సు ఘనం గా ముగిసింది ఈసదస్సు ను వైస్ ఛాన్సలర్ ప్రొఫెర్లు జ్ఞానమని ప్రారంభించారు కాగా ఈ మూడు రోజులు సైబర్ క్రైమ్ సెక్యూరిటీ, బిగ్ డేటా, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి అంశాలపై అకాదామిసియన్స్ చర్చలు జరిపారు. ముగింపు సదస్సు కు గౌరవ అతిధులుగా dr విజయ కుమారి ప్రిన్సిపల్ కృష్ణ యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజ్,dr ఆనంద రాజ ఆంధ్ర లోయిల కాలేజ్,Dr జాషువా విజ్ఞాన కాలేజ్ అఫ్ ఇంజనీరింగ్ విచ్చేశారు. Dr విజయకుమార్ మాట్లాడుతూ కంప్యూటర్ సైన్స్ విభాగం లో ఎన్నో విప్లవాత్మక మార్పులు మరియు టెక్నాలజీ అభివృద్ధి జరుగుతుందని ప్రపంచం చాలా వేగంగా సాంకేతికతను అలవటుచేసుకొగలుగుతుంది అని మెరుగైన వైద్య ఉపాధి అవకాశాలు ఈ కోర్సులు చేసిన వారికి మెండుగా లభిస్తున్నాయి. అనంతరం గౌరవ అతిథులను ప్రిన్సిపల్ Dr రేఖ , కరస్పాండెంట్ సిస్టర్ లేనా క్వద్రశ్ సత్కరించారు. పరితీసిపంట్స్ కు ధ్రువ పత్రాలు అందచేశారు. ఈ కార్య క్రమం లో గ్రేస్ లిడియా, విభాగాధిపతి, డిగ్రీ వైస్ ప్రిన్సిపల్ ఉషకుమారి, విద్యావతి ,మాలతి మరియు విద్యార్థినులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *