-ఓటింగ్ లో గోప్యత పాటించడం, విడియో రికార్డింగ్ చెయ్యడం తప్పని సరి
-ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు ఖచ్చితంగా పాటించాలి
-రూరల్ ఆర్వో/జేసి తేజ్ భరత్
రాజమహేంద్రవరం రూరల్, నేటి పత్రిక ప్రజావార్త :
స్ధానిక కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఆదివారం రాజమండ్రి రూరల్ నియోజక వర్గం హోం వోటింగ్ టీమ్స్ మరియు ఎన్నికల సిబ్బంది తో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా రాజమండ్రీ రూరల్ ఆర్వో, జేసి తేజ్ భరత్ మాట్లాడుతూ హోం వోటింగ్ టీమ్స్ ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ నిర్దేశించిన నియమావళిని పాటించాలని కోరారు. ఆమేరకు ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా తగిన సూచనలు అందించడమైనది. పార్లమెంట్ మరియు అసెంబ్లీ నియోజకవర్గాల తాలూకు పోస్టల్ బ్యాలెట్ కవర్ (Form -13 సి) ను చూపిస్తూ వాటి పై వున్న సందేహాల పై స్పష్టమైన వివరణ ఇవ్వడం జరిగినది. హొమ్ ఓటింగు కోసం అంగీకారం తెలియ చేసిన వారికి ఇంటి వద్దనే ఓటు హక్కును వినియోగించుకునే వెసులుబాటు కల్పించడం జరుగుతోందనీ అన్నారు. రూరల్ పరిధిలో 85 ప్లస్ ఓటర్లు 1346 మంది ఉండగా 51 మంది ఫారం 12 డి ఇచ్చారని, పిడబ్ల్యుడి ఓటర్లు 2439 మందికీ గానూ 56 మంది ఫారం డి ఇచ్చినట్లు తెలిపారు. వారికి మే 2 వ తేదీన, ఆరోజున అందుబాటులో లేని ఎడల మే 8 వ తేదీన అవకాశం ఉందని తెలిపారు. ఇందుకోసం నియోజక వర్గ పరిధిలో 30 మంది ఎన్నికల సిబ్బంది తో కూడిన ఐదు బృందాలు నియమించినట్లు తెలిపారు.
ఈ సమావేశంలో, సహాయ రిటర్నింగ్ అధికారులు డిప్యూటీ కలెక్టర్ ఐ. సాయిబాబా, రూరల్ తహసీల్దార్ వై. కె. వి. అప్పారావు, కడియం తహశీల్దార్ బి.రమాదేవి, ప్లానింగ్ అధికారి కోటయ్య తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News