సూక్ష్మ పరిశీలనతో సమర్థవంతంగా పోలింగ్

– సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో సూక్ష్మ పరిశీలకుల సేవలు కీలకం
– విధులపై సరైన అవగాహనతో సజావుగా పోలింగ్ ప్రక్రియ
– విధుల నిర్వహణలో నిబద్ధత, నిష్పక్షపాతం ప్రధానం
– జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు మంజూ రాజ్పాల్, నరీందర్ సింగ్ బాలి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈసీఐ మార్గదర్శకాలను తు.చ. తప్పకుండా పాటిస్తూ సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో సూక్ష్మ పరిశీలనతో పోలింగ్ ప్రక్రియ సజావుగా జరిగేందుకు మైక్రో అబ్జర్వర్లు కృషిచేయాలని జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు మంజూ రాజ్‌పాల్‌, నరీందర్ సింగ్ బాలి సూచించారు.
ఆదివారం తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్.డిల్లీరావు ఆధ్వర్యంలో మైక్రో అబ్జర్వర్ల శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సాధారణ పరిశీలకులు మంజూ రాజ్‌పాల్‌, నరీందర్ సింగ్ బాలి హాజరై.. మైక్రో అబ్జర్వర్లకు పలు సూచనలు చేశారు. ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా విధుల‌పై స్ప‌ష్ట‌మైన అవ‌గాహ‌న పెంపొందించుకొని.. పోలింగ్ ప్ర‌క్రియ సాఫీగా జ‌రిగేందుకు మైక్రో అబ్జ‌ర్వ‌ర్లు కృషిచేయాల‌ని పేర్కొన్నారు. ఇందుకు శిక్ష‌ణ కార్య‌క్ర‌మాల‌ను స‌ద్వినియోగం చేసుకోవాల‌ని.. ప్ర‌తి అంశంపైనా ప్ర‌త్యేకంగా దృష్టిసారించాల‌న్నారు. ప్ర‌జాస్వామ్య స్ఫూర్తితో స్వేచ్ఛాయుత వాతావ‌ర‌ణంలో నిష్ప‌క్ష‌పాతంగా ఎన్నిక‌లు జ‌ర‌గ‌డంలో మైక్రో అబ్జ‌ర్వ‌ర్లు త‌మ‌దైన పాత్ర పోషించాల‌న్నారు. పోలింగ్ ప్ర‌క్రియ స‌మ‌యంలో గుర్తించిన స‌మ‌స్యాత్మ‌క, ఉల్లంఘ‌న‌ల‌ అంశాల‌ను జ‌న‌ర‌ల్ అబ్జ‌ర్వ‌ర్ల‌కు స‌రైన క‌మ్యూనికేష‌న్ మార్గం ద్వారా రిపోర్టు చేయాల్సి ఉంటుంద‌న్నారు. 18 అంశాల‌తో కూడిన మైక్రో అబ్జ‌ర్వ‌ర్ల రిపోర్టుపై ప్ర‌త్యేకంగా దృష్టిసారించాల‌ని.. ప్ర‌తి అంశాణ్నీ క్షుణ్నంగా ప‌రిశీలించి, నివేదిక అందించాల్సి ఉంటుంద‌న్నారు. మాక్‌పోలింగ్ విషయంలో అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని.. అదే విధంగా పోలింగ్ పార్టీ, పోలింగ్ ఏజెంట్లు, భ‌ద్ర‌తా సిబ్బంది త‌దిత‌రాల‌కు సంబంధించి ఈసీఐ మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా నిశిత ప‌రిశీల‌న అవ‌స‌ర‌మ‌ని సాధార‌ణ ప‌రిశీల‌కులు మంజూ రాజ్‌పాల్‌, న‌రీంద‌ర్ సింగ్ బాలిలు పేర్కొన్నారు.

క‌చ్చిత ప్ర‌ణాళిక అమ‌లుతో విజ‌య‌వ‌తంగా పోలింగ్‌: జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు
జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు మాట్లాడుతూ 720 పోలింగ్ కేంద్రాల లోకేష‌న్ల ప‌రిధిలో 1,874 పోలింగ్ స్టేష‌న్లు ఉన్నాయ‌ని.. వీటిలో 878 క్రిటిక‌ల్ పోలింగ్ స్టేష‌న్లు అని వెల్ల‌డించారు. స‌మ‌స్యాత్మ‌క పోలింగ్ స్టేష‌న్ల‌లో పోలింగ్ ప్ర‌క్రియను విజ‌య‌వంతంగా పూర్తిచేయ‌డంలో మైక్రో అబ్జ‌ర్వ‌ర్ల పాత్ర కీల‌క‌మైంద‌ని పేర్కొన్నారు. మొత్తం 632 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించినట్లు తెలిపారు.
వీరు మార్గ‌ద‌ర్శ‌కాల‌ను క‌చ్చిత‌త్వంతో స‌రైన విధంగా ప్ర‌ణాళిక‌ను అమ‌లు చేయ‌డం ద్వారా విజ‌య‌వంతంగా పోలింగ్ ప్ర‌క్రియ జ‌రిగేలా చూడొచ్చ‌న్నారు. మాక్ పోలింగ్‌, పోలింగ్ మెటీరియ‌ల్, పోలింగ్ పార్టీ, పోలింగ్ ఏజెంట్లు, సీక్రెసీ ఆఫ్ ఓటింగ్‌, పోలింగ్ స్టేష‌న్ లేఅవుట్‌, పోలింగ్ స్టేష‌న్ల వ‌ద్ద ఏర్పాట్లు, 17 (ఏ) రిజిస్ట‌ర్, ఓటింగ్ మెషీన్ సీలింగ్‌ త‌దిత‌ర విష‌యాల్లో మైక్రో అబ్జ‌ర్వ‌ర్లు పాటించాల్సిన జాగ్ర‌త్త‌ల‌ను వివ‌రించారు. హోం ఓటింగ్ బృందాల్లోనూ మైక్రో అబ్జ‌ర్వ‌ర్లు ఉంటార‌ని. ఆ సంద‌ర్భంలో తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌ను కూడా వివ‌రించారు. ప్ర‌జాస్వామ్య సంప్ర‌దాయాల‌ను, స్వేచ్ఛాయుత‌, నిష్ప‌క్ష‌పాత‌, ప్ర‌శాంత ఎన్నిక‌ల ప్రాభ‌వాన్ని నిల‌బెడ‌తామనే ప్ర‌తిజ్ఞను మైక్రో అబ్జ‌ర్వ‌ర్ల‌తో చేయించారు. ఈవీఎంలోని బ్యాలెట్ యూనిట్‌, కంట్రోల్ యూనిట్‌, వీవీ ప్యాట్‌పైనా శిక్ష‌ణ కార్య‌క్ర‌మంలో మైక్రో అబ్జ‌ర్వ‌ర్ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించారు. కార్య‌క్ర‌మంలో అసిస్టెంట్ క‌లెక్ట‌ర్ శుభం నోఖ్వాల్‌, డీఆర్‌వో వి.శ్రీనివాస‌రావు, ఎల్డీఎం కె.ప్రియాంక , శిక్ష‌ణ కార్య‌క్ర‌మాల నోడ‌ల్ అధికారి ఎన్‌వీ శివ‌ప్ర‌సాద్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *