విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అన్ని వర్గాల ప్రజల ఆదరణ తనకు ఎంతగానో సంతృప్తి కలిగిస్తోందని ఈ ఆదరణ ప్రకారం తాను భారీ మెజార్టీ తో గెలుస్తానని పశ్చిమ నియోజక వర్గ బీజేపీ అభ్యర్థి యలమంచిలి సత్యనారాయణ చౌదరి (సుజనా చౌదరి) ధీమా వ్యక్తం చేశారు. తన ఎన్నికల ప్రచారంలో భాగంగా సుజనా 34 డివిజన్లో విస్తృతంగా ప్రచారం చేసారు. టిడిపి అధ్యక్షులు అడ్డూరి కొండలరావు క్లస్టర్ ఇంచార్జ్ కొట్టేటి హనుమంతరావు బిజెపి డివిజన్ అధ్యక్షులు రుద్రపాటి వెంకటేష్ జనసేన డివిజన్ ప్రెసిడెంట్ ఆకుల శంకర్ వసంత కుమార్ తో కలసి కేదారేశ్వరపేట ఫ్రూట్ మార్కెట్, ఖుద్దస్ నగర్ ప్రాంతాల్లో పర్యటించారు. ఈ ప్రచారంలో టిడిపి అధికార ప్రతినిధి నాగు ల్ మీరా, బీజేపీ నాయకుడు పైలా సో మినాయుడు, జన సేన నాయకుడు బాడి త శంకర్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News