బొండా ఉమామహేశ్వరరావు ఎన్నికల ప్రచార రోడ్ షో

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని 24వ డివిజన్  సికమణి సెంటర్ వద్ద నుండి జనసేన భారతీయ జనతా పార్టీలు బలపరిచిన తెలుగుదేశం పార్టీ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి బొండా ఉమామహేశ్వరరావు శుక్రవారం  ఎన్నికల ప్రచార రోడ్ షో ను నిర్వహించారు.

ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ… గత తెలుగుదేశం పార్టీ ఈ సెంట్రల్ నియోజకవర్గంలో తాను అధికారంలో ఉండగా జరిగిన అభివృద్దే తప్ప ఈ వైసిపి పాలన లో ఒక్కశాతం కూడా పనులు ముందుకు సాగ లేదు అని, చంద్రబాబునాయుడు  అనుభవమున్న వ్యక్తి,పవన్ కళ్యాణ్ నిబద్దత కలిగిన వ్యక్తి వీరిరువురి కలయిక రానున్న రోజులలో ప్రజలకు మేలు చేయబోతుంది ,జనసేన తెలుగుదేశం కలయికతో వైసీపీ పార్టీ నేతలకు గుండెల్లో దడ మొదలయ్యింది అని.. దీనికి తోడు ఎప్పుడు కూడా గత ప్రభుత్వాలు ఏవి  కనీవినీ ఎరుగని రీతిలో కరెంటు చార్జీలు, ఇంటి పన్ను ,నీటి పన్ను, అలాగే ఎప్పుడు కలలో కూడా ఊహించలేనటువంటి చెత్త మీద పన్నేసినటువంటి ఈ ప్రభుత్వం ప్రజలపై మరింత భారాన్ని మోపి పసి పిల్లలు తాగే పాల మీద లీటరుకు ₹20 రూపాయలు పైనే పెంచారని… తెలుగుదేశం పార్టీ కి మాత్రమే సంపద పెంచడం అభివృద్ధి చేయడం తెలుసు సంక్షేమం-అభివృద్ధి సమపాళ్లలో అమలు చేసి పేదల్ని ధనికులుగా చేయగల సత్తా ఒక్క నారా చంద్రబాబు కి మాత్రమే ఉందని ప్రజాభిప్రాయం కూడా అదే అని.. నవరత్నాలపై జగన్ రెడ్డి చెప్పిన గొప్పలన్నీ ఆచరణలో నీటి మూటలుగా మిగిలిపోయాయి అని, జాబ్ క్యాలండర్ అని చెప్పి యువతను మోసం చేశారు అని, వారంలో సీపీఎస్ రద్దని జిపిఎస్ తీసుకువచ్చారు. చివరకు అదీ లేక నిరుద్యోగులను మోసం చేసినది జగన్మోహన్ రెడ్డి .. ఈరోజు ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో జీతాలు, పెన్షన్ లు కూడా వచ్చే పరిస్థితి లేదు అని. ఒక్క చాన్స్ పేరుతో అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి నిజస్వరూపం ఈ 5 సంవత్సరాల  లొనే బట్టబయలైంది అని… ఈరోజు ఈ వైసీపీ వచ్చిన తర్వాత దెబ్బతిన్నటువంటి పేద బడుగు బలహీనవర్గాల కు నారా చంద్రబాబునాయుడు అయితేనే న్యాయం చేస్తారని నారా చంద్రబాబునాయుడు  తెలుగుదేశం పార్టీ మాత్రమే ప్రజలకు ఎప్పుడు తోడుగా నిలబడ్డాయని కాబట్టి గెలుపు మనదే అని.. టిడిపి జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి అదేవిధంగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సంయుక్తంగా ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టో లో మహిళలందరికీ RTC బస్సులో ఉచిత ప్రయాణం, తల్లికి వందనం పేరుతో మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే వారందరికీ ఒక్కొక్కరికి ఏడాదికి 15వేల రూపాయలు చొప్పున ఇవ్వడం, ఆడబిడ్డ నిధి నుంచి 18 ఏళ్ల నిండిన ప్రతి స్త్రీకి నెలకు 1500 రూపాయలు ఇవ్వడం, దీపం పేరుతో ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు, ప్రతి రైతుకు సంవత్సరానికి 20వేల రూపాయలు ఆర్థిక సహాయం,20 లక్షల మంది యువతకు ఉపాధి నిరుద్యోగులకు యువకులం నిధి నుంచి నెలకు 3,000 నిరుద్యోగ భృతి, ఇంటింటికి మంచినీరు పథకం, బీసీలకు రక్షణ చట్టం తెచ్చి వారికి అన్ని విధాల అండ, అలాగే పేదలను సంపన్నలను చేసే P4 ఐదేళ్లలో కనీసం రెట్టింపు ఆదాయం గురించి పూర్ To రిచ్ అనే పథకాలు వంటివి వారికి వివరించడం జరిగినది అని తెలిపారు.

ఈ జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది, ఎన్నికలకు ఇంకా 10 రోజులు సమయం మాత్రమే మిగిలి ఉంది ఈ రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వాన్ని పాల ద్రోలి  మళ్లీ ప్రజలకు స్వర్ణ యుగం లాంటి తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడడానికి సైకిల్ గుర్తు మీద ఓటు వేసి పార్లమెంట్ అభ్యర్థిగా కేసినేని శివనాద్ చిన్ని ని సెంట్రల్ నియోజకవర్గ MLA అభ్యర్థిగా బొండా ఉమా మహేశ్వర రావు కి గెలిపించుకోవాలని కోరడం జరిగినది.

ఈ కార్యక్రమంలో విజయవాడ దుర్గారావు, భత్తుల అప్పారావు, ఉదయ్ భాస్కర్, గాజుల రవి, ప్రభు, కుమారి దుర్గారావు తదితరులు పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *