-కౌంటింగ్ సక్రమంగా నిర్వహించి ఫలితాలు కౌంటింగ్ రోజున సాయంత్రం 4 గం.ల లోపు పూర్తికి ఏర్పాట్లు చేపడుతున్నాం : కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
కౌంటింగ్ సన్నద్ధతపై చేపడుతున్న ఏర్పాట్లపై రాష్ట్ర సచివాలయం నుండి అన్ని జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర చీఫ్ ఎలెక్టోరల్ అధికారి మరియు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా వర్చువల్ విధానంలో సమీక్ష నిర్వహించి దిశా నిర్దేశం చేయగా తిరుపతి జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి తిరుపతి కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ సంబంధిత అధికారులతో కలిసి హాజరై మాట్లాడుతూ తిరుపతి జిల్లా ఎన్నికల కౌంటింగ్ సజావుగా జరిగేలా నిబంధనల మేరకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
గురువారం ఉదయం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు సిఈఓ విసి నందు కలెక్టరు హాజరై మాట్లాడుతూ కౌంటింగ్ సూపర్వైజర్లు, కౌంటింగ్ సహాయకులు, మైక్రో అబ్జర్వర్లు కు విధుల కేటాయింపు కొరకు ఫస్ట్ ర్యాండమైజేషన్ ఈనెల మే26 న, రెండవ రాండమైజేషన్ జూన్ 3 తారీఖున అబ్జర్వర్ సమక్షంలో చేపట్టడం జరుగుతుందని తెలిపారు. 22 మే బుధవారం నాడు కౌంటింగ్ విధులకు హాజరయ్యే సిబ్బందికి మొదటి దశ శిక్షణ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. మీడియా సెంటర్ ఏర్పాటు చేపడుతున్నామని, తగినంత కేంద్ర బలగాలు రావడం జరిగిందని, స్ట్రాంగ్ రూం, కౌంటింగ్ కేంద్రం వద్ద, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణము ఎంట్రీ వద్ద భద్రత ఏర్పాట్లను చేశామని తెలిపారు. 90 సీసీ కెమెరాలు ఏర్పాటుతో, స్ట్రాంగ్ రూము దాని చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు కవర్ అయ్యేలా ఏర్పాటు చేశామని తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు నాలుగో తేదీన సాయంత్రం నాలుగు కల్లా పూర్తయ్యేలా ఏర్పాట్లు చేపడుతున్నామని,ఈవీఎం కంట్రోల్ యూనిట్ల ఓట్ల లెక్కింపు కూడా ఆలోపు పూర్తి చేస్తామని తదనుగునంగా ఏర్పాట్లు చేస్తున్నామని, తిరుపతి పార్లమెంటు నియోజక వర్గ పోస్టల్ బ్యాలెట్ 15 టేబుల్ ఏర్పాటుతో 3 రౌండ్లలో పూర్తి చేసేలా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. సీసీటీవీ కెమెరాలు వద్ద అభ్యర్థులు లేదా వారి ఏజెంట్లు పరిశీలించేలా ఏర్పాటు చేశామని తెలిపారు. ఈసిఐ, సిఈఓ ఏపీ వారి మార్గదర్శకాల మేరకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ గారు సిఈఓ కు వివరించారు.
Prajavartha Online Telugu News