కంట్రోల్ రూం నందు సీసీటీవీ కెమెరాల ద్వారా స్ట్రాంగ్ రూం ఏర్పాట్లను ప్రతి రోజు అభ్యర్థులు లేదా వారి ఏజెంట్లు పరిశీలించవచ్చు

-కౌంటింగ్ కేంద్రంలోనికి సెల్ ఫోన్, ఎలక్ట్రానిక్ గాడ్జెట్ లు అనుమతి లేదు
-స్ట్రాంగ్ రూం లను ప్రతి రోజూ అభ్యర్థులు లేదా వారి ఏజెంట్లు పరిశీలించే ఏర్పాటు చేశాం
-హింసాత్మక చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదు… తప్పక చర్యలు ఉంటాయి
-జిల్లాలో కౌంటింగ్ ప్రక్రియ సజావుగా ప్రశాంతంగా జరిగేందుకు అన్ని రాజకీయ పార్టీలు, అభ్యర్థులు సహకరించాలి: కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
కంట్రోల్ రూం నందు సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశామని స్ట్రాంగ్ రూం లను ప్రతి రోజు అభ్యర్థులు లేదా వారి ఏజెంట్లు పరిశీలించవచ్చని, స్ట్రాంగ్ రూం లను ప్రతి రోజూ అభ్యర్థులు లేదా వారి ఏజెంట్లు పరిశీలించే ఏర్పాటు చేశామని, కౌంటింగ్ కేంద్రంలోనికి సెల్ ఫోన్, ఎలక్ట్రానిక్ గాడ్జెట్ లు అనుమతి లేదని, హింసాత్మక చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదు… తప్పక చర్యలు ఉంటాయని, కౌంటింగ్ సజావుగా జరిగేందుకు అన్ని రాజకీయ పార్టీలు, అభ్యర్థులు సహకరించాలని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు.

గురువారం ఉదయం రాజకీయ పార్టీల నాయకులు, పోటీలోని అభ్యర్థుల సమావేశం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు కలెక్టర్ నిర్వహించి మాట్లాడుతూ పోల్డ్ ఈవిఎం లు భద్రపరచిన శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల నందు కట్టుదిట్టమైన భద్రత నడుమ ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూం 24X7 పరిశీలనకు సిసి కెమెరాలు ఏర్పాటు చేశామని వాటి పర్యవేక్షణ కంట్రోల్ రూం నుండి చేయడం జరుగుతుందని, స్ట్రాంగ్ రూం వద్ద కేంద్ర సాయుధ బలగాలు ఏర్పాటు చేశామని కౌంటింగ్ హాల్ నందు ఏర్పాట్లు దాదాపు పూర్తి చేశామని మిగిలినవి కౌంటింగ్ కు నాలుగు రోజుల ముందు చేపట్టి పూర్తి చేస్తామని తెలిపారు. తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి మొత్తం కలిపి 19017 పోస్టల్ బ్యాలెట్ ఉన్నాయని తెలిపారు. కౌంటింగ్ రోజున పోటీ చేస్తున్న అభ్యర్థులు లేదా వారి కౌంటింగ్ ఏజెంట్లు ఉదయం ఏడు గంటల కల్లా కౌంటింగ్ కేంద్రానికి చేరుకోవాల్సి ఉంటుందని తెలిపారు. పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ప్రాంగణంలోకి కౌంటింగ్ రోజున వాహనాల అనుమతి ఉండదని, పార్కింగ్ బయట వైపున సూచించిన ప్రదేశంలో ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుందని అన్నారు. ఈ నెల 14 న జరిగిన సంఘటనల దృష్ట్యా భద్రత చర్యలు మరింత కట్టుదిట్టం చేశామని, పోలీసు అధికారులు యూనివర్సిటీ ఎంట్రీ వద్ద తనిఖీ ఏర్పాటు ఉంటుందని, కౌంటింగ్ ఏజెంట్లు లేదా అభ్యర్థులు వారికి ఇవ్వబడిన కౌంటింగ్ గుర్తింపు కార్డును, పాస్ ను తీసుకురావాల్సి ఉంటుందని తెలిపారు. పోటీలో ఉన్న అభ్యర్థులు వారి ఏజెంట్ల నియామకం కొరకు కౌంటింగ్ అయిదు రోజుల ముందు గానే దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఈవిఎం ల కౌంటింగ్ ప్రక్రియ 14 టేబుల్ ల ఏర్పాటుతో గూడూరు 21 రౌండ్లు, సూల్లూరుపేట 22, వెంకటగిరి 22, తిరుపతి 20, శ్రీకాళహస్తి 21, సత్యవేడు 20 రౌండ్ల లెక్కింపు ఏర్పాటుతో, పోస్టల్ బ్యాలెట్ 15 టేబుల్ లు మూడు రౌండ్ల లెక్కింపు ఏర్పాటుతో చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఈటిబీపీఎస్ ఇప్పటి వరకు 129 గా ఉన్నాయని, 119- సర్వేపల్లి అసెంబ్లీ నియోజకవర్గం ఈవీఎం కౌంటింగ్ శ్రీ పద్మావతి పద్మా ప్రియదర్శిని ఇంజనీరింగ్ కాలేజ్ నందు జరుగుతుందని, అదే పోస్టల్ బ్యాలెట్ శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ తిరుపతి నందు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. వివిప్యాట్ స్లిప్పుల రాండమ్ పరిశీలన ఐదు పోలింగ్ స్టేషన్లకు సంబంధించి ప్రతి నియోజకవర్గానికి కౌంటింగ్ చివరలో అబ్జర్వర్ సమక్షంలో చేపట్టడం జరుగుతుందని తెలిపారు. కౌంటింగ్ ఏజెంట్లు లేదా అభ్యర్థులు కౌంటింగ్ కేంద్రంలోకి వచ్చేటప్పుడు పెన్ను, పెన్సిల్, నోట్ ప్యాడ్, 17 సి డూప్లికేట్ కాపీ తెచ్చుకోవచ్చని ఎట్టి పరిస్థితుల్లోనూ సెల్ ఫోన్లు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కౌంటింగ్ కేంద్రంలోనికి అనుమతి లేదని తెలిపారు. స్థలాభావం వలన కౌంటింగ్ కేంద్రంలో సీటింగ్ ఏర్పాటు నిబంధనల మేరకు సహకరించాలని అభ్యర్థులను, ఏజెంట్లను ఈ సందర్భంగా కోరారు. ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ నిర్వహణకు అన్ని రాజకీయ పార్టీలు అభ్యర్థులు సహకరించాలని కౌంటింగ్ పూర్తి అయిన తర్వాత ఎలాంటి ర్యాలీలు విజయోత్సవ సభలు సమావేశాలు నిర్వహించరాదని, మహిళా విశ్వవిద్యాలయం బయట ఎలాంటి ర్యాలీలు, సభలు నిర్వహించరాదని తెలిపారు.

ఈ సమావేశంలో డిఆర్ఓ పెంచల కిషోర్, వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులు, ఏజెంట్లు, ప్రతినిధులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పారిశ్రామికవేత్తలుగా పౌల్ట్రీ రైతులు

-వాతావరణ అనుకూల పౌల్ట్రీ షెడ్ల ఏర్పాటుకు కార్యాచరణ -ఐబీ గ్రూప్‌తో కలిసి కుప్పంలో పైలట్ ప్రాజెక్టు -రైతులు ఎంఎస్ఎంఈలుగా ఎదిగేలా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *