జూన్ 29న జాతీయ లోక్ అదాలత్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాబోయే జాతీయ లోక్ అదాలత్ దృష్ట్యా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఎస్పీలతో బుధవారం తూర్పుగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయసేవా సంస్థ చైర్మన్ గంధం సునీత, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.ప్రకాశబాబు స్ధానిక డి ఎల్ ఎస్ ఎ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. అనంతరం తూర్పుగోదావరి జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. జూన్ 29న జాతీయ లోక్ అదాలత్ లో నిర్వహించే ఈ సమావేశాల్లో ఉమ్మడి జిల్లాలోని అన్ని కోర్టుల్లో పెండింగ్ లో ఉన్న సివిల్ కేసులు, క్రిమినల్ కేసులు, ప్రీ లిటిగేషన్ కేసులను పెద్దఎత్తున పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. అదనపు జిల్లా కోర్టుల్లో మోటారు వాహన ప్రమాద కేసులను పరిష్కరించి బాధితులకు పరిహారం అందించేందుకు ప్రత్యేక చొరవ తీసుకోవాలి. ఇవే కాకుండా భూ వివాదాలు, ఆస్తి తగాదాలు, రెవెన్యూ కేసులు, మున్సిపల్ కేసులు, ఇతర నెగోషబుల్ కేసుల పరిష్కారానికి పలు సూచనలు చేశారు. ఈ సమావేశాల్లో తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ పి.జగదీష్, కాకినాడ జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్, డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్.పి. ఎస్.శ్రీధర్, ఎ.ఎస్. ఆర్ జిల్లా ఏ. జగదీష్, ట్రాఫిక్, డి సి ఆర్ బీ అధికారులు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా బార్ అసోసియేషన్ల అధ్యక్షులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *