-జల జీవన్ మిషన్ పథకం ద్వారా చేపట్టిన పనుల్లో నాణ్యత ప్రమాణాలను పాటించండి
-మండల స్థాయి తొలి సమీక్ష సమావేశంలో పాల్గొన్న….
-రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమా ఆటోగ్రాఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్
ఉండ్రాజవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వం ప్రాధాన్యత కార్యక్రమాలను ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికతో క్షేత్రస్థాయిలో అర్హులైన అందరికీ చేరేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమా ఆటోగ్రాఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు.
సోమవారం స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయ సమావేశం మందిరంలో ఎంపీపీ పాలాటి యల్లారీశ్వరి అధ్యక్షతన నిర్వహించిన మండల స్థాయి తొలి సమీక్ష సమావేశానికి మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖల పనితీరుపై క్షుణ్ణంగా సమీక్షించారు. అనంతరం మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమాన్ని సమ పాళ్లలో అందిస్తూ పరిపాలన కొనసాగించేలా అధికారులు దృష్టి సారించాలన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యతల ప్రకారం అధికారులు కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఇరిగేషన్ పనులను యుద్ధ ప్రాతిపదికన నిర్వహిస్తామని, అంతర్గత రహదారుల అభివృద్ధిని త్వరలో చేపట్టే విధంగా కార్యచరణ ప్రణాళిక సిద్ధం చేస్తామన్నారు. జల్ జీవన్ మిషన్ పనులలో నాణ్యత ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలన్నారు. ఎన్ఆర్ఈజీఎస్ లో గల్లంతయిన డబ్బులు లబ్ధిదారులందరికీ అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలో అర్హులైన లబ్ధిదారులకు అందించవలసిన బాధ్యత ఉద్యోగులపై ఉందన్నారు. ప్రజా ప్రతినిధులు అధికారులు సమన్వయంతో పని చేస్తూ నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వానికి మంచి పేరును తెచ్చే బాధ్యత మనపై ఉందన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కుల ప్రకారం పార్టీలకు అతీతంగా సేవలందించాలన్నారు. ఒక రకమైన భావజాలానికి అలవాటు పడిన అధికారులు, ఉద్యోగులు అది విడనాడి ప్రస్తుత ప్రభుత్వం అందించే విధి విధానాలు ద్వారా క్షేత్రస్థాయిలో లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలను అమలు అందించాలన్నారు. వర్షాకాలాన్ని దృష్టి లో పెట్టుకొని, సీజనల్ వ్యాధు లు ప్రబలకుండా, ముందస్తు ఏర్పాటు చర్యలుచేసుకోవాలని వైద్యాధికారులకు సూచించా రు. డిజాస్టర్ ప్రిపేర్ మెంట్ కోసం సంబంధిత అధికారులు సమావేశం నిర్వహించు కోవాలని, అటువంటి సమయాల్లో పశుసంపదను కోల్పోకుండా చూసుకోవాలన్నారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మండలంలో అమలు వ్యవసాయం, ఇరిగేషన్, రోడ్లు భవనాలు, పంచాయతీ రాజ్, సంక్షేమ పథకాలు, వివిధ రకాల. పింఛన్లు అమలు పై సమీక్షించారు.
ఈ సమీక్ష సమావేశంలో తహసిల్దార్ కె.నవీన్ కుమార్, ఎంపీడీవో కే.నరేంద్రరెడ్డి, ఈఓఆర్డి జెడివి ప్రసాద్, ఎంపీపీ పాలాటి ఎల్లారీశ్వరి, వైస్ ఎంపీపీ నరహరి సరోజ, సర్పంచులు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కే శ్రీనివాసరావు వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొ న్నారు.
Prajavartha Online Telugu News