ఆగస్టు 15 నాటికి మోరంపూడి ఫ్లైఓవర్ ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నాం…

-రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురందేశ్వరి / ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా ప్రయోజనాల దృష్ట్యా నిరంతరం రద్దీ ప్రదేశమైన మోరంపూడి జంక్షన్ వద్ద నిర్మింస్తున్న మోరంపూడి ఫ్లైఓవర్ ను ఆగస్టు 15 నాటికి ప్రజలకు అందుబాటులోకి తీసుకుని రానున్నమని పార్లమెంట్ సభ్యులు దగ్గుబాటి పురందేశ్వరి తెలియ చేసారు. బుధవారం ఎంపీ దగ్గుపాటి పురందీశ్వరి, రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎంపీ మాగంటి మురళీమోహన్ తో కలిసి మోరంపూడి ఫ్లైఓవర్, సర్వీస్ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి మాట్లాడుతూ రాజమహేంద్రవరం నగరంలో ట్రాఫిక్ సమస్యను అధిగమిస్తూ ప్రమాదాలను నియంత్రించే విధంగా జాతీయ రహదారి మోరంపూడి జంక్షన్ వద్ద ఫ్లైఓవర్ నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని ఆగస్టు 15న నాటికి ప్రజల అంకితం చేయడం జరుగుతుందన్నారు. జాతీయ రహదారి 216 పైన 1.42 కిలోమీటర్ల నిడివి తో నాలుగు లైన్ల ఫ్లైఓవర్ ను గతం లో రూ.60 కోట్లు అంచనా వ్యయం తో ప్రారంభించడం జరిగిందన్నారు. ప్రస్తుతం సర్వీస్ రోడ్డు స్థల సేకరణ, ప్రాజెక్టుకు సంబంధించి ఇతర అభివృద్ధికి గాను
సుమారు రు. 100 కోట్ల కేంద్ర నిధులు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు.

ఇందుకు అవసరమైన అంచనాలను వెంటనే సిద్ధం చేసి తమకు సమర్పించాలని జాతీయ రహదారి ప్రాజెక్టు డైరెక్టర్ డి. సురేంద్రనాధ్ కు సూచించారు. ఆగస్టు 15 నాటికి ఫ్లైఓవర్ ప్రజా వినియోగార్ధం పూర్తిస్థాయిలోకి తేవటమే తమ లక్ష్యమని ఈ సందర్భంగా ఆమె అన్నారు.

రాజమండ్రి నగర శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ మోరంపూడి ఫ్లైఓవర్ గతంలో తమ ప్రభుత్వ హయాంలోనే రు.60 కోట్ల రూపాయల నిధులతో ప్రాజెక్టు శంకుస్థాపన చేయటం జరిగిందని, తదుపరి జాప్యం కారణంగా నేటి వరకు ఫ్లైఓవర్ పనులు నత్తనడకన సాగిందని ప్రస్తుతం మళ్లీ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినందున ఫ్లైఓవర్ పనులకు అంచనా వేయవలసినదిగా నేషనల్ హైవేస్ ఆధారటి అధికారులకు సూచించడం జరిగిందని ప్రస్తుతం రు. 100 కోట్లతో ఫ్లైఓవర్ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టి సాంకేతిక పరంగా ఎటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటన్నింటిని పరిష్కరించి త్వరలోనే పూర్తి చేస్తామని అందుకు తమ వంతు కృషి చేస్తామని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ మాగంటి మురళీ మోహన్, ఎన్ హెచ్ ఏ ఐ ప్రాజెక్ట్ డైరెక్టర్ డి సురేంద్రనాథ్, స్థానిక నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *