మానసిక చికిత్స కేంద్రాన్ని సందర్శన

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
బుధవారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ కె. ప్రకాష్ బాబు రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలోని మానసిక చికిత్స కేంద్రాన్ని సందర్శించారు. ఈ విభాగంలో చికిత్స పొందుతున్న వారి వివరాలు, వారికి అందుతున్న వైద్య సదుపాయాలు మరియు ఇతర వివరాలను గురించి సదరు అధికారులను అడిగి తెలుసుకున్నారు. మానసిక రుగ్మతల నుండి పూర్తిగా ఉపశమనం పొందిన వారిని తిరిగి వారి కుటుంబ సభ్యులతో కలిపేందుకు తగు చర్యలు తీసుకోవాలని, ఈ విషయంలో ఎలాంటి న్యాయ సహాయం అవసరమైనా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా సహకారం అందిస్తామన్నారు. మానసిక చికిత్స విభాగంలో చికిత్స పొందుతున్న వారితో కార్యదర్శి ప్రకాశ్ బాబు మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితుల గురించి తెలుసుకున్నారు. ఆసుపత్రి అందిస్తున్న సదుపాయాలు, వైద్యులు అందిస్తున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. వైద్యుల సలహాలు పాటిస్తూ తగు జాగ్రత్తలు పాటిస్తే త్వరగా కోలుకోవచ్చని అన్నారు. ఈ కార్యక్రమం లో మానసిక చికిత్స కేంద్రాన్ని సంబందించిన డాక్టర్లు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *