Breaking News

బ్యాంకర్లు వ్యవసాయం, విద్య, ఎం.ఎస్.ఎం.ఈ, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి ప్రాదాన్యత రంగాలకు లక్ష్యం మేరకు రుణాలు మంజూరు చేయాలి

-జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
బ్యాంకర్లు వ్యవసాయం, విద్య, ఎం.ఎస్.ఎం.ఈ వంటి ప్రాదాన్యత రంగాలకు లక్ష్యం మేరకు రుణాలు విరివిగా మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ బ్యాంక్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఉదయం స్థానిక జిల్లా కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలు నందు జిల్లా స్థాయి బ్యాంకర్స్ కమిటీ సమావేశం చైర్మన్ హోదాలో జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, ఎల్డీఎం విశ్వనాథ రెడ్డి, ఆర్బిఐ ఎల్ డి ఓ పూర్ణిమ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజినల్ మేనేజర్ జి. రాంప్రసాద్, వివిధ బ్యాంకు అధికారులుతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ … 2024- 25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వ్యవసాయం, విద్య, ఎం.ఎస్.ఎం.ఈ, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి రంగాలకు ప్రాదాన్యతనిస్తూ బ్యాంకర్లందరూ రుణాలను మంజూరు చేయడంతో పాటు నిర్దేశించబడిన లక్ష్యాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. కౌలు రైతు కార్డుదారులకు క్రాప్ లోన్ కి సంబంధించిన రుణాలను బ్యాంకర్లు సకాలంలో మంజూరు చేయాలనీ తెలిపారు. కౌలు రైతు కార్డు లను రెన్యువల్ చేసుకోవాల్సిన కౌలు రైతులను గుర్తించి రెన్యువల్ చేసేలా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కు సంబంధించి ప్రజలకు అవగాహన కల్పించడంతోపాటు రుణాల మంజూరు చేయడంలో ఎలాంటి జాప్యం చేయరాదని తెలిపారు. బ్యాంకర్లు ప్రభుత్వ ప్రాధాన్యత గల పథకాలపై ప్రత్యేక దృష్టి పెట్టి లక్ష్యం మేరకు రుణాలను మంజూరు చేయాలని తెలిపారు. జిల్లాలో ఫైనాన్స్ లిటరసీ కార్యక్రమంలో భాగంగా డిజిటల్ లావాదేవీల పై ప్రజలకు అవగాహన కల్పించేలా ప్రత్యేక శిబిరాలను నిర్వహించాలని తెలిపారు. కల్పించాలన్నారు. అనంతరం Annual credit plan 2024-25 బుక్ లెట్ ను జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో కలిసి విడుదల చేశారు.

ఈ సమావేశంలో డి ఆర్ ఓ పెంచల్ కిషోర్, నాబార్డ్ డి.డి.ఎం సునీల్, డిఆర్డిఏ పి డి ప్రభావతి, జిల్లా సూక్ష్మ సేద్య అధికారి సతీష్, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *