Breaking News

రాష్ట్రంలో మూడు క్రికెట్ అకాడ‌మీలు ఏర్పాటుకి కృషి : ఏసీఏ అధ్య‌క్షుడు ఎంపి కేశినేని శివ‌నాథ్

-మంగళగిరి అంతర్జాతీయ క్రికెట్ మైదానంలో ఏసీఏ కౌన్సిల్ సమావేశం
-గ్రామీణ స్థాయి నుంచి క్రికెట్ అభివృద్ధికి చర్యలు
-ప్రపంచ మౌలిక స్థాయి వసతులు కల్పనపై చ‌ర్చ‌
-విశాఖ, మంగళగిరి క్రికెట్ మైదానాల్లో మార్పులు
-మంగ‌ళ‌గిరి స్టేడియంకి మ‌రో 35 ఎకరాలు కావాలని సీఆర్డీఏకు లేఖ
-సీడ్ యాక్సెస్ రహదారి నుంచి క్రికెట్ మైదానానికి నేరుగా రోడ్డు నిర్మాణం
-రాబోయే ఐపీఎల్ మ్యాచుల్లో ఏపీ నుంచి 20 మంది ఎంపికయ్యేలా శిక్షణ

మంగ‌ళ‌గిరి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో మూడు క్రికెట్ అకాడ‌మీలు పెట్ట‌బోతున్నాము. అనంతపురంలో మహిళా అకాడమీ ,విజయనగరంలో మెన్స్ అకాడమీ, విజయవాడ మూలపాడు స్టేడియంలో సీనియర్ మెన్స్ అకాడమీలు పెట్టబోతున్నాం. బెంగుళూర్ లో బిసిసిఐ ఏర్పాటు చేసిన సెంట‌ర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ సెంట‌ర్ ఏ విధంగా వుందో అదే విధంగా ఈ మూడు క్రికెట్ అకాడ‌మీ సెంట‌ర్స్ ఏర్పాటు చేసేందుకు చ‌ర్య‌లు తీసుకోనున్న‌ట్లు ఆంధ్రాక్రికెట్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడు విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివనాథ్ తెలిపారు.

ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ మంగళగిరి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం కార్యాలయంలో ఏసీఏ అద్యక్షుడు ఎం.పి కేశినేని శివ నాథ్ అధ్యక్షతన ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ గురువారం జ‌రిగింది. ఈ స‌మావేశంలో మంగళగిరి క్రికెట్ స్టేడియం అభివృద్ధి తో పాటు, రాష్ట్రంలో క్రికెట్ అభివృద్ధికి సంబంధించి దాదాపు 16 అంశాలపై చర్చించారు. అలాగే మంగ‌ళ‌గిరి క్రికెట్ స్టేడియం నిర్మాణంలోని లోపాల‌ను స‌రిచేసేందుకు అహ్మాదాబాద్ న‌రేంద్ర‌మోదీ ఇంట‌ర్నేష‌న‌ల్ స్టేడియంకు ప‌నిచేసిన పాపుల్య‌స్ (Populous), చెన్నైకి చెందిన ఎన్.వి అసోసియేట్స్ ఆర్కిటెక్చ‌ర్ కంపెనీల‌తో మాట్లాడి స‌ల‌హాలు సూచ‌న‌లు తీసుకున్నారు.

ఏసీఏ అపెక్స్ కౌన్సిల్ స‌మావేశం అనంతరం ఏసీఏ అధ్య‌క్షుడు ఎంపి కేశినేని శివనాథ్ మీడియాతో మాట్లాడారు. ఈ స‌మావేశంలో ఏసీఏ ను ముందుకు ఎ విధంగా తీసుకువెళ్లాలి..గ్రామీణ ప్రాంతాల్లో కూడా క్రికెట్ అభివృద్ది చెందే విధంగా ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవాల‌నే అంశాల‌పై చ‌ర్చించ‌టం జ‌రిగిందన్నారు.. క్రీడాకారులకు మెరుగైన సదుపాయాలు క‌ల్పించేందుకు అకాడ‌మీ ఏర్పాటు చేయ‌టం గురించి కూలంకుషంగా చ‌ర్చించ‌టం జ‌రిగిందని చెప్పారు. క్రీడాకారుల‌కి మెరుగైన వ‌స‌తి సౌక‌ర్యాలు వుండే విధంగా ఏర్పాటు చేయ‌ట‌మే కాకుండా క్రీడాకారులు అక్క‌డే శిక్ష‌ణ పొందేందుకు అనుకూలంగా అకాడ‌మీలు వుంటాయ‌న్నారు.

క్రీడా స‌దుపాయ‌లు లేని గ్రామీణా ప్రాంతాల్లో కూడా గ్రౌండ్స్ ఏర్పాటు చేయాల‌నుకుంటున్న‌ట్లు తెలిపారు. ప్ర‌తిభ గ‌ల క్రీడాకారుల‌ను గుర్తించి త్వ‌ర‌లో ఏర్పాటు చేయ‌బోయ ఈ అకాడ‌మీల్లో శిక్ష‌ణ ఇప్పిస్తామన్నారు. ఈ అకాడ‌మీలో శిక్ష‌ణ పొందిన క్రికెట్ క్రీడాకారులు ఎక్కువ మంది ఆంధ్రప్రదేశ్ నుంచి ఐపిఎల్ లో, ఇండియ‌న్ క్రికెట్ టీమ్ లో సెలెక్ట్ అయ్యే విధంగా శిక్షణ ఇప్పిస్తామ‌ని తెలిపారు. రాబోయే ఐపీఎల్ మ్యాచుల్లో ఏపీ నుంచి 20 మంది ఎంపికయ్యేలా ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ ప్లేయ‌ర్స్ తో శిక్షణ ఇప్పించే విధంగా కృషి చేస్తున్న‌ట్లు తెలిపారు.

రాబోయే ఐపీఎల్ సీజన్ లో రాష్ట్రంలో ఐపీఎల్ మ్యాచ్ లు జ‌రుగుతాయ‌ని… దానికి తగిన విధంగా వైజాగ్ స్టేడియన్ని సిద్దంగా చేస్తున్న‌ట్లు పేర్కొన్నారు. అలాగే మంగ‌ళ‌గిరి క్రికెట్ స్టేడియంలో ఇంట‌ర్నేష‌న‌ల్ మ్యాచ్ లు జ‌రిగేందుకు ఏ విధంగా మెరుగుప‌ర్చాలనే అంశం పై ఆలోచ‌న చేసిన‌ట్లు తెలిపారు. ఇందుకోసం .అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం ని ఎవరైతే ఆర్కిటెక్చ‌ర్ వర్క్ చేశారో వారిని కన్సల్ట్ గా అపాయింట్ చేసుకోవ‌టం జరిగిందని ప్ర‌క‌టించారు. అంతే కాదు వైజాగ్ స్టేడియం విజయవాడ స్టేడియం మంగళగిరి స్టేడియం మెరుగుపరిచే విధంగా కూడా వారితో మాట్లాడిన‌ట్లు చెప్పారు

ఇక రాష్ట్రంలో క్రికెట్ టోర్న‌మెంట్ లు పెంచేందుకు ఆలోచ‌న చేస్తున్నట్లు తెలిపారు. అండ‌ర్ 19 క్రికెట్ టోర్న‌మెంట్ లు కూడా తీసుకు రాబోతున్నట్లు చెప్పారు. సౌతిండియాలో వున్న రాష్ట్ర క్రికెట్ అసోసియేష‌న్స్ తో మాట్లాడి ఇంకా టోర్న‌మెంట్స్ పెంచే విధంగా చ‌ర్య‌లు తీసుకుంటున్న చ‌ర్య‌లు వివ‌రించారు. విజ‌యన‌గ‌రం, వైజాగ్, విజ‌య‌వాడ, మంగ‌ళ‌గిరి, అనంత‌పురం క‌డ‌ప స్టేడియాల్లో ఈ టోర్నమెంట్స్ జ‌రిగే విధంగా చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు.

మంగ‌ళ‌గిరి క్రికెట్ స్టేడియం 12 సంవ‌త్స‌రాల క్రితం డిజైన చేసిన స్టేడియం కాబట్టి నిర్మాణంలో చాలా లోపాలు వున్నాయన్నారు. ఎక్క‌డ కూడా పార్కింగ్ స‌దుపాయం లేదని.. ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ స్టేడియం పార్కింగ్ కి బిసిసిఐ నిబంధ‌న‌లు ప్ర‌కారం 14 ఎక‌రాల స్థలం కావాల్సి వుంద‌న్నారు. ఇక ఇంటర్నేష‌న‌ల్ మ్యాచ్ లు జ‌ర‌గాలంటే ఇక్క‌డ మంచి స్పోర్ట్స్ సెంట‌ర్ వుండాలని తెలిపారు. వీటిన్నింటీకి 35 ఎక‌రాల స్థ‌లం కావాల్సి వుండ‌గా, ఇప్ప‌టికే ప్ర‌భుత్వానికి , సిఆర్డిఎ కి ఇక్క‌డ వున్న స్థ‌లాన్ని ఇప్పించాల్సిందిగా విజ్ఞ‌ప్తి చేయ‌టం జ‌రిగింది వారు ఇవ్వ‌టానికి సిద్దంగా వున్నారని తెలిపారు.

ఇక స్టేడియంకు వ‌చ్చేందుకు ర‌హ‌దారులు కూడా అభివృద్ది పై దృష్టి పెట్టిన‌ట్లు చెప్పారు.
మ‌రో నాలుగు నెలల్లో వెస్ట్ర‌న్ బైపాస్ పూర్తి అవుతుంది. వెస్ట్ర‌న్ బైపాస్ నుంచి స్టేడియంకి రోడ్ వ‌చ్చే విధంగా ప్ర‌పోజ‌ల్స్ పెట్ట‌డం జ‌రిగిందని తెలిపారు. . రాబోయే రోజుల్లో స్టేడియంకు సీడ్ యాక్సెస్ రోడ్ లింక్ చేసే విధంగా కూడా కృషి చేస్తున్న‌ట్లు తెలిపారు. మంగ‌ళ‌గిరి-నిడ‌మ‌ర్రు రైల్వే గేట్ ద‌గ్గ‌ర నాలుగు వ‌రుస‌ల ఆర్.వో.బి ప్ర‌పోజ‌ల్ పెట్ట‌డం జ‌రిగింద‌ని..ఈ ప‌నుల‌న్నీ త్వ‌ర‌లో ఆచ‌ర‌ణ‌లోకి రానున్నాయ‌న్నారు. ఈ స్టేడియం సిద్దం అయ్యే లోపు ఇవన్నీ పూర్తి అవుతాయ‌న్నారు.

ఈ స్టేడియం నిర్మాణం జ‌రిగి 12 సంవ‌త్సరాలు అవ్వడం వల్ల స్టేడియం స్టేచర్ పాడైపోయింది నిపుణుల‌తో మాట్లాడి వారి ఆధునికంగా తయారు చేస్తామ‌న్నారు. ఈ సమావేశంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ పి. వెంకట రామ ప్రశాంత్, సెక్రెటరీ సానా సతీష్, కోశాధికారి దండమూడి శ్రీనివాస్, కౌన్సిలర్ దంతుగౌరు విష్ణు తేజ్ పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *