విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వర్గీకరణ చేస్తే ఎన్డిఎ ప్రభుత్వంనకు ఇదే చివరి ప్రభుత్వం అని దళిత బహుజన పార్టీ డిబిపి జాతీయ అధ్యక్షులు. ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి జాతీయ చైర్మన్ వడ్లమూరి కృష్ణ స్వరూప్ ప్రకటించారు. శనివారం గాంధీనగర్ లోని ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో అయన మాట్లాడారు. వర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వంనకు లేదని.. భారత పార్లమెంట్ కి మాత్రమే అధికారం ఉంటుందన్నారు. రాజ్యాంగంలోకి ఆర్టికల్ 341.342 ప్రకారం వర్గీకరణ వర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వంనకు లేదన్నారు. దళితులను చీల్చి అణిచివేయడానికి ప్రభుత్వం కుట్రలు కు పాల్పడిందన్నారు. వర్గీకరణ. క్రిమిలేయర్ కు వ్యతిరేకంగా..డిసెంబర్ 19 న ఛలో అమరావతి కార్యక్రమంను విజయవంతం చేయాలని దళిత జాతులకు పిలుపు ఇచ్చారు. ఈ సందర్బంగా ఛలో అమరావతి కి సంబందించిన కరపత్రం ను మీడియా సమావేశంలో ఆవిష్కరణ చేసారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుమ్మడి మహాలక్ష్మి, పార్టీ జిల్లా అధ్యక్షులు కొలకూరి నాగార్జున, మాలమహానాడు ఉమ్మడి కృష్ణ జిల్లా అధ్యక్షులు పంతగాని సురేష్, పార్టీ ఎన్టీఆర్ జిల్లా మీడియా కన్వీనర్ ఎస్. ఆంజనేయకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News